Alexa
YSR
‘పేదలందరూ పక్కా ఇళ్లలో ఉండాలన్నదే నా అభిమతం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జాతీయంకథ

గిలానీపై ఎన్‌ఐఏ విచారణ

Sakshi | Updated: May 20, 2017 01:29 (IST)
గిలానీపై ఎన్‌ఐఏ విచారణ

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ఉగ్ర సంస్థల నుంచి నిధులు అందుకొంటూ కశ్మీరులో విద్రోహ చర్యలకు పాల్పడుతున్న సయ్యద్‌ అలీషా గిలానీ, మరో ముగ్గురు వేర్పాటువాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రాథమిక విచారణ చేపట్టింది. ఎన్‌ఐఏ బృందం శుక్రవారం శ్రీనగర్‌కు చేరుకుంది. గిలానీతోపాటు పాక్‌ ఉగ్ర సంస్థల నుంచి నిధులు పొందుతూ స్టింగ్‌ ఆపరేషన్‌లో పట్టుబడిన నయీమ్‌ ఖాన్, ఫరూఖ్‌ అహ్మద్‌ దార్‌ అలియాస్‌ బిట్టా కరాటే, తెహరీక్‌ ఏ హురియత్‌కు చెందిన గాజి జావేద్‌ బాబాలపై విచారణ చేపట్టినట్టు ఎన్‌ఐఏ ప్రతినిధి వెల్లడించారు.

కశ్మీరు లోయలో భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడం, ప్రభుత్వ ఆస్తులను తగులబెట్టడం వంటి విధ్వంసక చర్యలతో అల్లర్లు రేపినందుకు గానూ పాకిస్తాన్‌ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ మహమ్మద్‌ సయీద్‌ నుంచి ఈ వేర్పాటువాదులకు నిధులు అందుతున్నాయని తెలిపారు. అలాగే ఓ టీవీ జర్నలిస్టుతో వేర్పాటువాదులు జరిపిన సంభాషణలను కూడా పరిగణలోకి తీసుకొంటున్నట్టు ఎన్‌ఐఏ ప్రతినిధి చెప్పారు.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

ఉత్త భ్రమిత్‌ షా!

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC