సిద్ధూ ఆస్తులు రూ.46 కోట్లు

సిద్ధూ ఆస్తులు రూ.46 కోట్లు - Sakshi


అమృత్‌సర్‌: కాంగ్రెస్‌లో చేరిన మాజీ క్రికెటర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ (53) అమృత్‌సర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్‌ పత్రంలో తనకు రూ. 45.91 కోట్ల ఆస్తులున్నాయని వెల్లడించారు. ఇందులో రూ.44లక్షల వాచీలు, రూ. 15 లక్షల బంగారు నగలు, రూ. 30 కోట్ల ఫ్లాట్లు్ల, 2 లాండ్‌ క్రూయిజర్లు, ఓ మినీ కూపర్‌ ఉన్నట్లు పేర్కొన్నారు.



2015–16 ఆర్థిక సంవత్సరానికి రూ. 9.66 కోట్ల ఆదాయాన్ని చూపించారు. సిద్దూ భార్య నవజోత్‌ కౌర్‌కు రూ. 6.94 కోట్ల ఆస్తులున్నట్లు తెలిపారు. దీంతోపాటుగా రూ. 2.35 కోట్ల పర్సనల్‌ లోన్, రూ. 54.24 లక్షల అప్పులున్నట్లు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top