ప్రధాని మోదీ ప్రసంగం-ముఖ్యాంశాలు

ప్రధాని మోదీ ప్రసంగం-ముఖ్యాంశాలు - Sakshi


న‍్యూఢిల్లీ: భారతదేశాన్ని నూతన దిశలో నడిపించేందుకు ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు సహృదయంతో స్వీకరించారని ప్రధనమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శనివారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.  నోట్ల రద్దు తర్వాత జనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారని, అయితే ఆ నిర్ణయంతో నల్లధనం, అవినీతి రూపుమాసిపోతాయని తాను మరోసారి చెబుతున్నానని ప్రధాని అన్నారు.


చదవండి... (ఇక వేలిముద్రే మీ గుర్తింపు!) 


ప్రభుత్వం, ప్రజలు కలిసికట్టుగా సాగితేనే దేశ భవిష్యత్తు ఉజ్వలం అవుతుందనడంలో సందేహం లేదని తెలిపారు. దేశంలో అమలవుతోన్న ఆర్థిక విధానంలో ఎన్నో లోపాలున్నాయని,. నగదు ఎక్కువగా చెలమణిలో ఉండటం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయాన్నారు. అవినీతి, నల్లధనమూ పెరిగిందని అయితే నగదు రహిత విధానంతో ఈ సమస్యలన్నీ రూపుమాసిపోతాయని ప్రధాని పేర్కొన్నారు.


భీమ్ యాప్ అంటే ఏంటో తెలుసా? 


ప్రధాని ప్రసంగంలోని ముఖ్య అంశాలు...


  • కృత నిశ్చయంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం

  • దీపావళి తర్వాత దేశం కీలక నిర్ణయం తీసుకుంది

  • సమాజంలోని నల్లధనం, బ్లాక్‌ మార్కెటింగ్‌ నిజాయితీపరుల్నినిరాశపరిచాయి

  • దేశవ్యాప్తంగా ప్రజలు ధైర్యంతో కష్టాలు ఎదుర్కొంటూ చెడుపై విజయం సాధించేందుకు పోరాడుతున్నారు

  • నల్లధనంపై ఉక్కుపాదంతో దీర్ఘకాలంలో ప్రయోజనాలు

  • స్వచ్ఛత దిశగా దేశం అడుగులు వేస్తోంది

  • సమాజంలోని చెడు జీవితంలో భాగమైపోయిందనుకుంటున్నారు

  • అవినీతిపై పోరాటం చేయడానికి దేశ ప్రజలు అవకాశం కోసం ఎదురు చూశారు

  • పెద్దనోట్ల రద్దు స‍్వచ్ఛ కార‍్యక్రమం

  • నగదు రద్దుతో నిజాయితీపరులు కూడా కాస్త కష్టపడ్డారు

  • సత్యం అన్నది భారతీయులకు ముఖ్యమైనది

  • దేశప్రజలు సత్యాన్ని, నిజాయితీని నిరూపించుకున్నారు

  • నవంబర్‌ 8 నుంచి ప్రజలు చెడుపై పోరాడుతున్నారు

  • ప్రజల కష్టాలు దేశ భవిష్యత్‌ కు ప్రతీక

  • నల్లధనంపై పోరాటంలో త్యాగ స్ఫూర్తిని చాటారు

  • అవినీతి దేశానికి చీడలా పట్టింది

  • బంగారు భవిష్యత్‌ కోసం ప్రజలు కష్టాలను ఓర్చారు

  • సత్యం కోసం ప్రజలు, ప్రభుత్వాలు ఎలా పోరాడాయో తెలుసుకునేందుకు ఇది చారిత్రక ఉదాహరణ

  • గడిచిన యాభై రోజులు ప్రజలు పడ్డ ఇబ్బందులు, బాధలు నాకు తెలుసు

  • ప్రజల ఆశీస్సులతో బ్యాంకుల వద్ద సాధారణ స్థితికి ప్రయత్నిస్తున్నాం

  • కొత్త సంవత్సరంలో మళ్లీ పూర్వస్థితిని తీసుకొస్తాం

  • మీరు చూపిన ప్రేమ నాకు ఆశీర్వాదం లాంటిది

  • బ్యాంకుల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు దృష్టి పెడుతున్నారు

  • గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కరెన్సీ కొరత బాధ కలిగించింది

  • కరెన్సీ లేకపోవడంతో సమస్యలు వస్తాయి

  • అలాగే అధికంగా కరెన్సీ ఉండటం కూడా సమస్యలకు దారితీస్తుంది

  • రామ్‌ మనోహర్‌ లోహియ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి లాంటి నేతలు చూపిన 

  • ధైర్యాన్ని, సాహసాన్ని, సహనాన్ని ప్రజలు చూపించారు
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top