‘వెంకయ్యకు బీపీ పెరగకుండా చూస్తాం’

‘వెంకయ్యకు బీపీ పెరగకుండా చూస్తాం’ - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ శాసన సంబంధ అనుభవమున్న నేత ఉప రాష్ట్రపతి పదవి చేపట్టనుండటం బహుశా ఇదే తొలిసారి అని వెంకయ్య నాయుడును ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆయనది గ్రామాలకు, రైతులకు అంకితమైన జీవితం అని అభివర్ణించారు. వెంకయ్య నామినేషన్‌కు ముందు జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ ప్రసంగించారు. ‘అనేక ప్రాంతాల్లో పనిచేసిన అనుభవమున్న నేత ఉపరాష్ట్రపతి పదవి చేపట్టటమూ ఇదే తొలిసారి కావొచ్చు. ఆయన దేశమంతా తిరిగి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. కేబినెట్‌ సమావేశాల్లో వ్యవసాయంపై వెంకయ్య చేసే సూచనలు విధాన రూపకల్పనకు ఉపయోగపడ్డాయి’ అని తెలిపారు.



వెంకయ్య అభ్యర్థిత్వంపై అద్భుత స్పందన వచ్చిందన్నారు. రాజ్యసభలో సభాపతి వ్యవహరించనున్న ఆయనకు రక్తపోటు పెరగకుండా చూస్తామని పూర్తి హామీ ఇస్తున్నానని మోదీ సరదాగా అన్నారు. వెంకయ్య ఉపరాష్ట్రపతి కావడం బీజేపీకి పూరించలేని నష్టమని పార్టీ చీఫ్‌ అమిత్‌ షా పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక పదవికి ఇంత గొప్ప యోగ్యత గల నేత ఎంపికవడం హర్షణీయమన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top