వైద్యపరికరాలను మనం తయారుచేసుకోలేమా?


వైద్య పరికరాలను మనం తయారుచేసుకోలేమా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూటిగా ప్రశ్నించారు. ముంబైలో హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు మొత్తం దీనికి హాజరయ్యారు. శాస్త్ర, సాంకేతిక విద్యలో మన సామర్థ్యం అపారమని, వైద్య ఆరోగ్య రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుంటూ సమస్యలను అధిగమించాలని ప్రధాని మోదీ సూచించారు. 98 ఏళ్ల నాటి భవనం మళ్లీ కొత్తగా ప్రారంభం కావడం సంతోషమన్నారు.



దేశంలో శిశు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని, వైద్య పరికరాల ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయని ప్రధాని చెప్పారు. వైద్య పరికరాలను మనం తయారు చేసుకోలేమా అని ప్రశ్నించారు. టెలి మెడిసిన విధానం ఇప్పటికీ సామాన్యులకు దూరంగానే ఉందని, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన ముఖ్యమని అన్నారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందిస్తే చాలావరకు వ్యాధులను అరికట్టగలమని ఆయన తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top