దెయ్యం దొరికింది!!

దెయ్యం దొరికింది!!


ముందుగా మంత్రగాళ్ల పనేనన్నారు...

ఆ తర్వాత త్రిశూలంతో వచ్చే ఓ వృద్ధుడే చేస్తున్నాడన్నారు..

మరికొందరైతే గ్రహాంతరవాసులే చేస్తున్నారన్నారు..

చివరికి.. ఓ దెయ్యమే ఇదంతా చేస్తోందని బలంగా నమ్మారు..

ఆ దెయ్యం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు..

ఎట్టకేలకు పోలీసులు ఆ దెయ్యాన్ని గుర్తించారు..

ఓ కవర్లో బంధించి, ప్రజల ముందుకు తెచ్చారు..

ఏంటీ.. ఇదంతా అబద్ధమనుకుంటున్నారా? నిజ్జంగా నిజం..

మొన్నీమధ్య దెయ్యం మహిళల జుట్టు కత్తిరించలేదా..

ఆ దెయ్యాన్నే పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకెళ్తే...




పట్నా: వచ్చినవాడు ఇళ్ల నుంచి ఏదీ దోచుకోవడం లేదు.. మహిళల జుట్టు మాత్రం కత్తిరించి వెళుతున్నాడు. ఆడవాళ్లు ఒంటరిగా ఉండటాన్ని చూసి భయానక ఆకృతిలో ఉన్న వృద్ధుడొకడు త్రిశూలంతో ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాడు. గమనించి వెళ్లమనేలోపే మహిళలు స్పృహ తప్పి పడిపోతున్నారు. మెలకువ వచ్చి చూసుకునే సరికి వారి జడ తెగిపడి ఉంటోంది. ఇలాంటి ఘటనలు  ఒకటిరెండు కాదు.. ఒకచోట రెండుచోట్ల కాదు.. ఢిల్లీ, గుర్గావ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ముంబై తదితర ప్రదేశాల్లో అనేకచోట్ల జరిగాయి. అయితే అన్ని చోట్లా వృద్ధుడేకాదు కొన్నిచోట్ల వృద్ధురాలు, మరికొన్ని ప్రాంతాల్లో దెయ్యం కూడా ఈ పనిచేసిందని, తాము స్వయంగా చూశామంటూ చెప్పారు. ఓ వృద్ధురాలిని కొట్టి చంపారు కూడా. వీటిని కొట్టిపారేసిన పోలీసులు అసాంఘిక శక్తుల పనేనని, వారిని పట్టుకొని కటకటాల వెనక్కు నెట్టుతామని శపథం చేశారు.





దెయ్యం కాదు.. ఓ పురుగు!

దేశవ్యాప్తంగా ఓ మిస్టరీగా మారిన ఈ వ్యవహారానికి సంబంధించి బిహార్‌ వాసులు మొదటిసారిగా నమ్మశక్యమైన విషయాన్ని చెప్పారు. ఇదంతా చేస్తోంది వృద్ధుడో, వృద్ధురాలో, దెయ్యమో కాదు.. ఓ చిన్న పురుగని నిరూపించారు.  బిహార్‌ రాజధాని పట్నాలోని రామకృష్ణానగర్‌లో ఓ వింతపురుగుని పట్టుకున్నారు. మహిళల జుట్టును కత్తిరిస్తోంది ఈ పురుగేనని చెబుతున్నారు. అంతేకాదు జుట్టును ఆ పురుగు నోటితో ఎలా కత్తిరిస్తోందో వీడియో కూడా తీసి, యూట్యూబ్‌లో పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ పురుగుని కవర్లో బంధించి, ఇప్పటికైనా పుకార్లను నమ్మవద్దంటూ ఊరూరా తిరుగుతూ.. పురుగును చూపిస్తూ చెబుతున్నారు.



సంబంధిత వార్తలువాళ్ల జుట్టు దెయ్యమే కత్తిరిస్తోందా...?





మహిళలు జుట్లు కత్తిరిస్తున్న అదృశ్యశక్తులు

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top