టక్కరి దొంగను పట్టి.. చేతులు వెనక్కి కట్టి!

టక్కరి దొంగను పట్టి.. చేతులు వెనక్కి కట్టి! - Sakshi


ఎవరైనా దొంగలు దొరికితే పోలీసులు వెంటనే ఏం చేస్తారు? మన దేశంలో అయితే రెండు చేతులకూ బేడీలు వేస్తారు.. లేదంటే గట్టిగా పట్టుకుని తీసుకెళ్తారు. అదే విదేశాల్లో అయితే ముందుగా చేతులు వెనక్కి విరిచిపట్టుకుని వాటికి బేడీలు వేస్తారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగ పారిపోడానికి గానీ, ఎదురు తిరగడానికి గానీ వీల్లేకుండా అలా చేస్తారు. కానీ మన దేశంలో.. అందులోనూ ముంబై మహానగరంలో ఒక దొంగను అధికారులు ఇలాగే బంధించాల్సి వచ్చింది. ఇంతకీ ఆ దొంగ గారు ఎవరో తెలుసా... ఓ కోతి!



అవును.. ముంబైలోని ఓ కాలనీలోకి ప్రవేశించి నానా గొడవ చేయడమే కాకుండా తిండి పదార్థాలను దొంగిలిస్తూ, వస్తువులు విసిరేస్తూ నానా తిప్పలు పెడుతోందట. దాంతో విసిగిపోయిన ఆ కాలనీ వాసులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వాళ్లు రంగప్రవేశం చేసి, సదరు కోతిగారిని పట్టుకుని, ఇలా చేతులు వెనక్కి విరిచి కట్టేయడమే కాకుండా, కాళ్లు కూడా కట్టేసి ఎటూ కదలకుండా అలా ఉంచారట. దానికి ఆకలి వేసే సమయానికి మాత్రం కొంచెం తిండి అందిస్తున్నారు లెండి.. మొత్తానికి దొంగ కోతిని చివరకు ఓ బోనులో బంధించారు.


Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top