కశ్మీర్లో మళ్లీ భూప్రకంపనలు


శ్రీనగర్: కశ్మీర్ లోయ మరోసారి భూప్రకంపనలతో ఊగిపోయింది. మంగళవారం తెల్లవారుజామున 3:40 గంటలకు సంభవిచిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 గా నమోదయింది. ఆఫ్ఘనిస్థాన్ లోని హిందుకుష్ పర్వత ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని జమ్ముకశ్మీర్ వాతావరణ శాఖ తెలిపింది.



ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాన్ని గురించిన సమాచారం తెలియరాలేదని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం కావడంతో లోయలోని ముస్లింలు అందరూ తెల్లవారుజామునే మేల్కొని ప్రార్థనలకు సిద్ధమవుతుండగా భూమి కంపించింది. దీంతో జనం ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఆదివారం కూడా 3.7 తీవ్రతతలో కశ్మీర్ లో భూమి కంపించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top