సిబ్బందిపై నెట్టేద్దాం...!


ఘోర రైలు ప్రమాదం విచారణను పక్కదారి పట్టించే యత్నాలు



సాక్షి, విశాఖపట్నం: తూర్పు కోస్తా రైల్వేలో అతి పెద్దదయిన హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై విచారణ పక్కదారి పట్టించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.  జనవరి 22న విజయనగరం జిల్లా కూనేరు స్టేషన్‌ వద్ద జగదల్‌పూర్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన దుర్ఘటనలో 41 మంది దుర్మరణం పాలవగా 70 మందికి పైగా గాయపడ్డ సంగతి తెలిసిందే. దీనిపై రైల్వే మంత్రిత్వశాఖ విచారణకు ఆదేశించింది. 



దీంతో  వారు ఈ ప్రమాదాన్ని విద్రోహ చర్యగా చూపాలని ప్రయత్నించారు. పట్టాను మావోయిస్టులు గాని, ఉగ్రవాదులు గాని కోయడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. తాజాగా రైలు బోగీ నుంచి ఏదో స్ప్రింగ్‌ జారిపడడం పట్టాలు తప్పడానికి కారణమైందని చెప్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రచారం వెనుక సంబంధిత ప్రాంత రైల్వే ఒకటో తరగతి అధికారుల పాత్ర ఉందని అంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top