లవర్ గిఫ్ట్ వద్దంటే బ్రేకప్ చెప్పేస్తాం!

లవర్ గిఫ్ట్ వద్దంటే బ్రేకప్ చెప్పేస్తాం!


న్యూఢిల్లీ: ప్రేమికుల రోజు దగ్గర పడుతున్న కొద్దీ లవర్స్ లో ఉత్సాహం మరింతగా ఉరకలేస్తుంటుంది. తాజాగా నిర్వహించిన ఓ సర్వే ఎవరికి ఎవరిపై ఎంత ప్రేమ ఉంటుంది.. తమకు నచ్చిన కోసం ఎంత టైం వెచ్చిస్తారో వెల్లడించింది. ప్రేయసి కోసం ఏం చేయాలి అని ప్రియుడు ఎక్కువ సమయం ఆలోచిస్తాడట. 18 నుంచి 45 ఏళ్ల వయస్సుల వారిపై కొన్ని ప్రశ్నలు సంధించి గిఫ్ట్ ఈజ్.కామ్ సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం... లవర్ కి ఎలాంటి గిఫ్ట్ కొనివ్వాలి, మిగతా లవర్స్ కంటే ఎంత భిన్నంగా ప్రపోజ్ చేయాలి అని అబ్బాయిలు ఆలోచిస్తారట.

 

మెట్రో పాలిటన్ నగరాల్లో 3000 మందిపై ఇటీవలే ఈ సర్వే చేశారు. మొత్తంగా 68 శాతం లవర్స్  తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. ఇందులో 38 శాతం లవర్స్ ఈ 'వాలెంటైన్స్ డే' ను ఏకాంతంగా జరుపుకోవాలనుకోగా, 22 శాతం స్నేహితుల సమక్షంలో జరుపుకోవాలనుకుంటున్నారట. 8 శాతం లవర్స్ వినూత్నంగా అలోచిస్తున్నారు. ఫస్ట్ టైమ్ డేటింగ్ కి వెళ్దామని డిసైడ్ అయినట్లు చెప్పారు. యువకులు తన లవర్ కు గిఫ్ట్ కొనిచ్చేందుకు రూ.740 ఖర్చు చేస్తుండగా, యువతులు తన లవర్ కోసం రూ.670 మాత్రమే వెచ్చిస్తున్నారని సర్వేలో తేలింది.



బ్రేకప్ చెప్పేందుకు సై...

తాము ఇచ్చిన గిఫ్ట్ నచ్చలేదు, తీసుకోము అని లవర్ చెబితే తమ లవర్ తో బ్రేకప్ చెప్పేస్తామని ప్రతి ఏడుగురు అమ్మాయిల్లో ఒకరు చెప్పడం గమనార్హం. ప్రేమికుల రోజు అనగానే 42 శాతం అమ్మాయిలు ఎంతో ఉత్సాహంగా ఉంటే, 47 శాతం యువకులు మరింత జోష్ గా తయారవుతారని ఈ ఆన్ లైన్ సర్వేలో వెల్లడైంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top