హర్యానా ముఖ్యమంత్రిగా ఖట్టర్ ప్రమాణ స్వీకారం

హర్యానా ముఖ్యమంత్రిగా ఖట్టర్ ప్రమాణ స్వీకారం


చంఢీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్లాల్ ఖట్టర్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానాలోని పంచ్కులలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఖట్టర్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అద్వానీతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీనియర్ నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.


1966లో హర్యానా రాష్ట్రం ఏర్పాటైంది. ఆ తర్వాత మనోహర్లాల్ ఖట్టర్ ఆ రాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హర్యానా అసెంబ్లీకి మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 15న ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 47 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. దీంతో ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా మనోహర్లాల్ ఖట్టర్ను ఎంపిక చేసింది.



 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top