ఆ వేడుకకు మన్మోహన్‌ సింగ్‌ దూరం

ఆ వేడుకకు మన్మోహన్‌ సింగ్‌ దూరం - Sakshi

న్యూఢిల్లీ: చారిత్రాత్మక సంస్కరణ, పెద్ద మార్పు అనే పేరిట తీసుకొస్తున్న వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా డుమ్మా కొడుతున్నారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి ప్రారంభం కానున్న జీఎస్టీ కోసం పార్లమెంటు సెంట్రల్‌ హాలులో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాలు పంచుకోవడం లేదని కాంగ్రెస్‌ పార్టీ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో మన్మోహన్‌ సింగ్‌ కూడా హాజరుకావడం లేదని తెలిసింది. ‘జూన్‌ 30 అర్థరాత్రి జీఎస్టీ ప్రారంభోత్సవం సందర్భంగా సెంట్రల్‌ హాలులో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుచేసిన వేదికను కాంగ్రెస్‌ పార్టీ పంచుకోవడం లేదు’ అని పార్టీ నేత సత్యవ్రత్‌ చతుర్వేది స్పష్టం చేశారు.



మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తోపాటు అంతకంటే ముందు ప్రధానిగా పనిచేసి హెచ్‌డీ దేవగౌడకు కూడా మోదీతో వేదికను పంచుకునేందుకు ఆహ్వానం పంపించారు. తాను వస్తున్నానంటూ ఇప్పటికే దేవగౌడ స్పష్టం చేయగా మన్మోహన్‌ మాత్రం గైర్హాజరు కానున్నారు. ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ వేడుకకు హాజరుకావడం లేదని ప్రకటించింది. అలాగే, వామపక్షాలు, బీఎస్పీ, ఎస్పీ తదితర పార్టీలు కూడా దూరం పాటించనున్నాయి. ముఖ్యంగా చేనేత కార్మికుల ఆందోళనలు, వస్త్ర దుకాణాదారుల ఇబ్బందులు, చిరు వ్యాపారుల సమస్యలు పట్టించుకోకుండానే జీఎస్టీని ప్రారంభిస్తున్నందున తాము ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదంటూ తెలిపారు.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top