'అవి గే, స్వలింగ సంపర్కులకు నిలయాలు'

'అవి గే, స్వలింగ సంపర్కులకు నిలయాలు' - Sakshi


అలీగఢ్:  మదరసాలపై ఓ ప్రొఫెసర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ మదరసాల గురించి మాట్లాడుతూ 'అవి గే, స్వలింగ సంపర్కులకు నిలయాలు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ముస్లిం విద్యార్థులు బాగుపడాలంటే మదరసాలపై నిషేధం విధించాలని సూచించారు. యూనివర్సిటీలోని హిస్టరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ వసీం రాజా తన వాట్సాప్ ద్వారా ఓ టీవీ ఛానల్కు ఈ సందేశాన్ని పంపించారు.



అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులలో స్వలింగ సంపర్కులు ఉన్నారని, ఇతర మదరసాలలో కూడా ఇటువంటి వ్యవహారం నడుస్తోందంటూ ఆ ప్రొఫెసర్ వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. . తాను సార్క్ దేశాల సదస్సులలో పాల్గొన్నానని, ఎప్పుడూ వర్గాలు, మతాల పునరుద్ధరణ అంశాలపై మాట్లాడుతుంటానని చెప్పారు. మదరసా అనేది మతానికి సంబంధించినది కాదని తన అభిప్రాయం అన్నారు.



ఇక వాట్సాప్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా... ఆ సందేశాలు తాను పంపలేదని, తన అకౌంట్ను ఎవరో హ్యాక్ చేశారని ప్రొఫెసర్ వసీం తెలిపారు. కాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఆ వీడియోపై విద్యార్థులు మండిపడుతున్నారు.  వసీం రాజా వ్యాఖ్యలను యూనివర్సిటీ డైరెక్టర్ రషీద్ షాజ్ ఖండించారు. మదరసా విద్యార్థులు ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉంటారని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top