పీవీ నుంచి నేటి జయ వరకు అదే కంపెనీ

పీవీ నుంచి నేటి జయ వరకు అదే కంపెనీ


చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థీవ దేహాన్ని ఖననం చేయడం కోసం ప్రత్యేకంగా గందపు చెక్కలతో తయారుచేసిన శవపేటికను తయారు చేయించారు. అయితే, ఈ పేటికను రూపొందించిన కంపెనీ ఇప్పటి వరకు దాదాపు 500 మంది ప్రముఖులకు పేటికలను తయారు చేసి ఇచ్చిందంట. జయ చనిపోయిన వెంటనే ప్రత్యేక పేటికను రూపొందించే పనిని ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అండ్‌ హోమేజ్‌ కంపెనీకి అప్పగించారు. దీంతో ప్రత్యేకంగా గందపు చెక్కలతో ఆ కంపెనీ శవపేటికను రూపొందించి ఇచ్చింది.



ఈ పేటికలోపల 0 నుంచి 5డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతను కొనసాగించగలిగితే మూడు రోజుల వరకు కూడా మృతదేహం చెక్కు చెదరదని ఆ కంపెనీ చెబుతోంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రముఖ నటుడు శివాజీ గణేశన్‌, మనోరమవంటి ప్రముఖులకు కూడా ఈ కంపెనీనే పేటికలను రూపొందించింది. ‘జయకోసం రూపొందించిన పేటికను హెవీ డ్యూటీ కంప్రెజర్‌, ఫ్రీజర్‌ బాక్స్‌ రూపొందించాం. ఇది శరీరాన్ని త్వరగా చెడిపోకుండా ఉంచుతుంది’ అని ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌ పీఆర్‌ఎంఎం శాంతకుమార్‌ తెలిపారు. 1994లో పేటికలను తయారుచేసి హక్కును పొందిన ఆయన ఇప్పటి వరకు 500మంది ప్రముఖులకోసం ప్రత్యేక పేటికలను తయారు చేయించి ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top