'అణ్వాయుధాలను పాకిస్థాన్ నుంచి సంపాదించుకుంటాం'

'అణ్వాయుధాలను పాకిస్థాన్ నుంచి సంపాదించుకుంటాం'


లండన్:ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థకు పాకిస్థాన్ ల మధ్య సంబంధాలు బలపడుతున్నాయా? పాశ్చాత్య దేశాలనే లక్ష్యంగా చేసుకుని చెలరేగాలని భావిస్తున్న ఐఎస్ఐఎస్ సభ్యులకు పాకిస్థాన్ సహకారం అందించనుందా?అంటే అవుననే పరిస్థితులే కనిపిస్తున్నాయి. పాశ్యాత్య దేశాలను మీద దాడి చేయడానికి పాకిస్థాన్ నుంచి అణ్వాయుధాలను సరఫరా చేసుకుంటామని  ఐఎస్ఐఎస్ తాజాగా చేసిన  ప్రకటన కలకలం రేపుతోంది.


 


ఆ దేశాలపై దాడి చేయడానికి తమకు భారీ స్థాయిలో అణ్వాయుధాలు కావాలని ఐఎస్ఐఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఒక సంవత్సరం లోగా ఆ అణ్వాయుధాలను సంపాదించుకుంటామని.. అవి కూడా పాకిస్థాన్ నుంచే దిగుమతి చేసుకుంటామని వారు హెచ్చరికలు జారీ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top