‘ఇన్‌శాట్ 3డీ’తో హుదూద్‌పై ముందు జాగ్రత్త!


న్యూఢిల్లీ: ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించిన హుదూద్ తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడంలో మన ‘ఇన్‌శాట్ 3డీ’ ఉపగ్రహం ఎంతో తోడ్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. హుదూద్ తుపానును గుర్తించడంతో పాటు దాని ప్రయాణమార్గం, తీవ్రత, గాలివేగం వంటి ఎన్నో వివరాలను ఆ ఉపగ్రహం అత్యంత కచ్చితత్వంతో అందజేసిందని తెలిపింది. ఈ మేరకు వాతావరణశాఖ ఒక నివేదికను విడుదల చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top