ఇండియన్ బ్యాంక్ నుంచి మొబైల్ యాప్

ఇండియన్ బ్యాంక్ నుంచి మొబైల్ యాప్


చెన్నై : తమ కస్టమర్ల సౌకర్యార్థం ఓ ప్రభుత్వ బ్యాంక్ మొబైల్ యాప్ విడుదల చేసింది. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఎమ్కె జైన్ ఈ యాప్ను ఆవిష్కరించారు. ఇండియన్ బ్యాంక్ జాతీయం చేయబడిన ఓ బ్యాంక్. ఈ మొబైల్ యాప్ ద్వారా మనం ఎక్కడినుంచైనా బ్యాంకు ఖాతాలను నిర్వహించుకునే అవకాశం ఉంది. ఐఎన్డీపే(IndPay) అనే యాప్ ను ఇండియన్ బ్యాంకు వారు ప్రారంభించారు.


ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఈ యాప్ను సులభంగా ఉపయోగించుకోవచ్చని ఆసంస్థ వెల్లడించింది. సమాచారం తెలుసుకోవడానికి, మిని స్టేట్మెంట్, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నగదు బదిలీలు వంటి సౌకర్యాలు ఈ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top