'ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలు ఎవరినీ క్షమించవు'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జాతీయంకథ

భారత్‌కు రాకెట్‌ కలలు ఎక్కడ పుట్టాయంటే..

Others | Updated: February 17, 2017 16:53 (IST)
భారత్‌కు రాకెట్‌ కలలు ఎక్కడ పుట్టాయంటే..

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలు నేడు భారత్‌వైపు చూస్తున్నాయి. ఆర్థికాభివృద్ధిలో లేడి పరుగులో ఉన్న భారత్‌ సాంకేతిక పరంగా కూడా అంతకుమించిన వేగంతో ఉందని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నాయి. ప్రపంచ దేశాల్లో భారత్‌ కూడా ఓ కీలక దేశంగా మారడం అతి త్వరలోనే ఖాయం అని ఇప్పుడు పలు దేశాలు చెప్పుకుంటున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 104 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ 37 రాకెట్‌తో ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఘన విజయం సాధించిన ఇస్రో వైపు నేడు ప్రపంచ దేశాలు మరింత ప్రత్యేక దృష్టితో చూస్తున్నాయి. ఎందుకంటే 104 ఉపగ్రహాల్లో 101 ఉపగ్రహాలు కూడా విదేశాలకు చెందినవే.

వారి వారి అవసరాలకు తగినట్లుగా రూపొందించుకున్న శాటిలైట్స్‌ను భద్రంగా అంతరిక్ష కక్ష్యల్లో కూర్చొబెట్టి వారికి భారత్‌ పూర్తి భరోసాను ఇచ్చింది. అయితే, అసలు భారత్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ముందు ఎప్పుడు భారత్‌ రాకెట్‌ వ్యవస్థ గురించి చర్చించారు ? ఎక్కడ చర్చించారు? అందులో ఎవరెవరు ఉన్నారు? అంతకుముందు భారత్‌ ఉపగ్రహాలను ప్రవేశపెట్టాల్సి వచ్చినప్పుడు ఎవరిపై ఆధారపడింది?వంటి విషయాలు తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపడక తప్పదు.

1963లో భారత్‌లో రాకెట్‌ వ్యవస్థను ప్రవేశ పెట్టాలనే ఆలోచన తొలిసారి అహ్మదాబాద్‌లో పురుడు పోసుకుంది. ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్‌సారాభాయి, డాక్టర్‌ సత్య ప్రకాశ్‌, డాక్టర్‌ ప్రఫుల్‌ భవ్‌శరాంద్‌, ప్రొఫెసర్‌ యూడీ దేశాయ్‌, తదితరుల ఈ సమావేశంలో పాల్గొన్నారు. నేటి రాకెట్‌ విజయానికి తొలి కల ఆరోజే మొదలైంది. నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌(ఎన్‌సీఎస్‌ఆర్‌) అహ్మదాబాద్‌లో సారాబాయి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో వారు అమెరికా అప్పటికే ప్రారంబించిన రాకెట్‌ మిషన్స్‌ గురించి చర్చించారు. ఆ సమయంలో తమకు తిరువనంతపురంలో తుంబా రాకెట్‌ ప్రయోగ క్షేత్రం నిర్మించుకునేందుకు సహాయం చేయాలని అమెరికాను, నాసాను కోరారు.

ఆ సమయంలో అమెరికా తయారు చేసిన 725 కేజీల నైక్‌-అపాచీతో ప్రయోగం నిర్వహించగా దానికి ప్రొఫెసర్‌ భవ్‌సార్‌, జీఎస్‌ మూర్తి ఇంచార్జ్‌గా ఉన్నారు. నవంబర్‌ 21, 1963లో ఈ తొలి అడుగు మొదలైంది. అది గంటకు 3,800 కిలోమీటర్లు వెళ్లింది. ​సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రపరిజ్ఞానం సహాయంతో దేశంలోని పేదరికాన్ని పూర్తిగా రూపుమాపవచ్చని సారాబాయి ధృడ విశ్వాసం. దానికి తగినట్లుగానే ఆయన దేశంలో కొన్ని సంస్థలకు అంకురార్పణ చేశారు. తొలిసారి తనను 1948 సారబాయి తీసుకెళ్లారని, ఆ సమయంలో తామిద్దరం కాస్మిక్‌ కిరణాలు, రాకెట్లు, ఉపగ్రహాలపై తీవ్రంగా పరిశోధించామని డాక్టర్‌ భవసార్‌ తెలిపారు.

అలా, తాము చేసిన పరిశోధన ఫలితంగా 1967 నవంబర్‌ 20న తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రోహిణి ఆర్‌హెచ్‌-75ని తుంబా నుంచి ప్రయోగించినట్లు చెప్పారు. ఆ సమయంలో అసలు తాము రాకెట్‌ ద్వారా ఉపగ్రహాలను ప్రవేశపెట్టగలమా లేదా అని తెలుసుకునేందుకే ఆ ప్రయోగం నిర్వహించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు అత్యధికంగా ఒకేసారి 37 ఉపగ్రహాలు ప్రవేశ పెట్టిన దేశంగా రష్యా ఉండగా, తన రికార్డును ఇప్పట్లో ఎవరూ బద్ధలుకొట్టలేనంత దూరంలో 104 ఉపగ్రహాలు అంతరిక్షంలో ప్రవేశపెట్టి భారత్‌ ముందుంది.  


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

తెలంగాణ థౌజండ్‌వాలా

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC