'చంద్రుడి నుంచి భారత్‌కు శక్తి'

'చంద్రుడి నుంచి భారత్‌కు శక్తి'

న్యూఢిల్లీ: చంద్ర మండలం నుంచి భారత అవసరాలకు శక్తిని తెచ్చుకునే వీలు కలుగుతుందని ఇస్రోకు చెందిన ఓ శాస్త్రవేత్త చెప్పారు. చంద్రునిపై అధికంగా లభ్యమయ్యే హీలియం-3 నుంచి భారత అవసరాలకు శక్తిని సమకూర్చుకోవచ్చని శివాంతను పిళ్లై వెల్లడించారు. ఓఆర్‌ఎఫ్‌-కల్పనా చావ్లా స్పేస్‌ పాలసీ కార్యక్రమంలో మాట్లాడుతూ 2030 కల్లా ఈ ప్రాసెస్‌ పూర్తి అవుతుందని తెలిపారు.

 

మరొకొద్ది రోజుల్లో ప్రజలు చంద్రుడి మీదకు హనీమూన్‌కు వెళ్తారని అన్నారు. చంద్రుని మీద భూమిని తవ్వి హీలియం-3ని భూమికి తీసుకురావడం ఇస్రో లక్ష్యాల్లో ఒకటని చెప్పారు. గతంలో పిళ్లై బ్రహ్మోస్‌ ఎరోస్పేస్‌ చీఫ్‌గా కూడా పనిచేశారు. మిగతా ప్రపంచదేశాలు కూడా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయని వెల్లడించారు. ప్రపంచం మొత్తానికి సరిపడే హీలియం చంద్రుడిపై ఉందని చెప్పారు.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top