అవినీతి నిర్మూలనపై మోడీకే అధికారాలు


ఐఏఎస్‌ల క్రమశిక్షణా చర్యల పై  పీఎం నిర్ణయమే కీలకం



న్యూఢిల్లీ: లోక్‌పాల్, కేంద్ర విజిలెన్స్ కమిషన్, అవినీతి వ్యతిరేక చ ట్టం తదితర అంశాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్వాధికారిగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. తన అజమాయిషీలో ఉన్న సిబ్బంది శిక్షణ వ్యవహారాలు, ప్రజా సమస్యల, పెన్షన్ల వ్యవహారాల మంత్రిత్వశాఖ (డీఓపీటీ) ఆద్వర్యంలో ప్రధాని ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. సవూచార హక్కు (ఆర్టీఐ), కొత్త అఖిల భారత సర్వీసుల ఏర్పాటు తదితర అంశాలపై ప్రధానిదే తుదినిర్ణయం కాబోతోంది. ఇటీవల అంతర్గతంగా జరిగిన అధికారాల పంపిణీతో, తన పరిధిలో పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోబోయే వివిధ అంశాలను  వివరిస్తూ డీఓపీటీ తన అధికారులందరికీ ఒక సర్క్యులర్ జారీచేసింది.



సర్క్యులర్ ప్రకారం... ఐఏఎస్ అధికారులు,  కేంద్ర సచివాలయ అధికారులు, గ్రేడ్-వన్ ఆపై హోదాకలిగిన అధికారులు, సీబీఐ గ్రూప్ ఏ అధికారులపై క్రమశిక్షణ చర్యల కేసులపై ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటారు.  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి  చైర్మన్, సభ్యుల నియామకం, రాజీనా మా, బర్తరఫ్ తదితర అశాలు, అవినీతి వ్యతిరేక చట్టం, విధానపరమైన అంశాలు, లోక్‌పాల్ చట్టం, కేబినెట్ నోట్ రూపకల్పన,  కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) అధికారాలపై ప్రధానిదే నిర్ణయం. సీబీఐలోని  ఐపీఎస్ అధికారుల నియామకం, సర్వీసు పొడిగింపునకు ఏసీసీనుంచి అనుమతి పొందవలసి ఉంటుంది.



‘కోడ్’ కేసు మూసివేతకు అభ్యంతరం లేదు



అహ్మదాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ప్రధాని నరేంద్ర మోడీపై దాఖలైన కేసును మూసివేయడంపై తనకు  ఏమాత్రం అభ్యంతరం లేదని అహ్మదాబాద్ నగర క్రైమ్ బ్రాంచ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ హెచ్‌ఏ రాథోడ్ కోర్టుకు నివేదించారు.  అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎంహెచ్ పటేల్ కోర్టులో రాథోడ్ ఈ మేరకు నివేదించారు. మోడీ ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడలేదని గుజరాత్ పోలీసులు ఈ నెల 8న కోర్టుకు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో, న్యాయప్రక్రియ లాంఛనంలో బాగంగా రాథోడ్ కోర్టుకు సమాధానాన్ని దాఖలు చేశారు.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top