Alexa
YSR
‘ప్రతిపల్లెలోనూ అందరికీ గ్యాస్‌ సరఫరా, ప్రతి మహిళకూ ఆర్థిక భరోసా నా ధ్యేయం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జాతీయంకథ

ఐటీ ఎన్నికోట్లు పట్టుకుందో తెలుసా!

Others | Updated: January 03, 2017 10:03 (IST)
ఐటీ ఎన్నికోట్లు పట్టుకుందో తెలుసా!

న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.4,663కోట్ల లెక్కలు చూపని ఆదాయాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఈ మొత్తం ఆదాయాన్ని గుర్తించినట్లు ఐటీ అధికారులు సమాచారం. అంతేకాకుండా తాజాగా గుర్తించిన లెక్కచూపని వాటిల్లో రూ.562కోట్లను సీజ్‌ చేసినట్లు కూడా తెలిసింది.

వీటిల్లో రూ.110కోట్లు కొత్త నోట్లు ఉన్నాయట. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 253 చోట్ల సోదాలు నిర్వహించినట్లు, 556 సర్వేలు చేసినట్లు, 289 చోట్ల సీజ్‌ చర్యలు తీసుకున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. పన్నులకు సంబంధించి మొత్తం 5,062 నోటీసులు పంపించినట్లు కూడా వెల్లడించాయి. అంతకుముందు డిసెంబర్‌ 22నాటికి ఐటీ అధికారులు గుర్తించిన లెక్క చూపని ఆదాయం రూ.3,185కోట్లు. ఈ మొత్తాన్ని కూడా అప్పుడే వారు సీజ్‌ చేశారు.
 

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

మామిడి పండు.. దళారీ దండు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC