Alexa
YSR
‘తెలుగువారి గుండెచప్పుడు వినగలిగే ఆత్మీయుడిగా ఉంటే చాలు... నా జన్మ ధన్యమైనట్టే’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జాతీయంకథ

నేను స్వచ్ఛమైన తమిళుడిని

Sakshi | Updated: May 20, 2017 01:11 (IST)
నేను స్వచ్ఛమైన తమిళుడిని

రజనీకాంత్‌ స్పష్టీకరణ
- యుద్ధం వచ్చినప్పుడు రావాలంటూ అభిమానులకు పిలుపు
- ముగిసిన ఐదురోజుల సమావేశాలు
- రాజకీయ అరంగేట్రంపై కొనసాగుతున్న సస్పెన్స్‌


సాక్షి ప్రతినిధి, చెన్నై: తాను స్వచ్ఛమైన తమిళుడినని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పేర్కొన్నారు. రజనీకాంత్‌ తమిళుడేనా అని కొందరు ప్రశ్నించడం తనను బాధించిదన్నారు. తన 67 ఏళ్ల జీవితంలో కర్ణాటకలో నివసించింది కేవలం 23 ఏళ్లు మాత్రమేనని, 44 ఏళ్లుగా తమిళనాడులోనే నివసిస్తున్నానని చెప్పారు. చెన్నై, కోడంబాక్కంలోని శ్రీ రాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమానులతో రజనీకాంత్‌ నిర్వహించిన సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అభిమానులు తనను తమిళుడిగా మార్చివేశారని ఆయన చెప్పారు. తన ముత్తాతలు, తల్లిదండ్రులు కృష్ణగిరి జిల్లా సమీపంలోని నాచ్చికుప్పంలో జన్మించారని తెలిపారు.  ప్రజలు మార్పును కోరుకుంటున్నారు, ఆ మార్పునకు ఒక రూపు రావాలని చెప్పారు.

పూర్వం రాజుల కాలంలో ప్రజలు తమ పనులు చేసుకుంటూనే.. యుద్ధం వచ్చినపుడు శత్రువులతో పోరాడేవారిని, అదే విధంగా తన భేటీ అయిన అభిమానులు కూడా దైనందిన పనులు చూసుకుని యుద్ధం వచ్చినపుడు రావాలని పిలుపునిచ్చారు. తనపై వచ్చే విమర్శలకు చింతించవద్దని, రాజకీయాల్లో విమర్శలే పెద్ద పెట్టుబడి అని చెప్పారు. స్టాలిన్‌ (డీఎంకే), అన్బుమణి రాందాస్‌ (పీఎంకే), తిరుమావళవన్‌ (వీసీకే), సీమాన్‌ (నామ్‌తమిళర కట్చి) నేతలను ప్రశంసిస్తున్నట్లుగా మాట్లాడిన రజనీకాంత్‌.. అన్నాడీఎంకే, కాంగ్రెస్, ప్రధాని సహా బీజేపీ నేతలను ఎవర్నీ నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. ఐదురోజుల పాటు అభిమానులతో సమావేశమైనా ఆయన రాజకీయరంగ ప్రవేశంపై స్పష్టతనివ్వలేదు. అయితే ‘యుద్ధం వస్తుంది.. అపుడు రండి’ అని అభిమానులకు పిలుపునివ్వడం, తాను తమిళుడనేనని అని చెప్పడం చూస్తే ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అత్యున్నత విద్యావేదికగా రెడ్డి హాస్టల్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC