' ప్రియాంక జీవితాన్ని మార్చేసింది'

' ప్రియాంక జీవితాన్ని మార్చేసింది'


ఆమె ప్రయత్నంలో స్థైర్యం... ఆమె నవ్వులో ఆత్మవిశ్వాసం...  ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించే ఆ పదహారేళ్ళ అమ్మాయి ప్రదర్శనలు చూసినవారు మైమరచి పోవాల్సిందే.  ఓ సాధారణ యువతిగా, అతి భయస్తురాలిగా ప్రారంభమైన ఆమె ప్రయాణం నేడు  ఇటలీలోని ఓ ప్రముఖ యూనివర్శిటీ (యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ ది అడ్రియాటిక్) లో అధ్యయనం చేసే స్థాయికి చేరింది.  ఆమె పేరు.. ప్రియాంకా పాటిల్.



ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం, తండ్రి ఆసరా లేకుండా పెరిగిన నేపథ్యం. పూనెలోని ఎపిఫని పాఠశాలలో చదివే రోజుల్లోనే ఆమె ప్రదర్శనలు.. వీధి నాటకాలు ప్రే‌క్షకులను అమితంగా అలరించాయి. ప్రాచీన నాగరికతకు చెందిన నాటకాలను వేయడంలో ప్రియాంకది అందెవేసిన చేయి. ఎపిఫనీ హైస్కూల్లో ప్రియాంక ప్రదర్శనను చూసిన  టీచ్ ఫర్ ఇండియా ఫెలో అహోనా కృష్ణ.. ఆమెను తమ సంస్థకు ఆడిషన్ ఇవ్వాలని కోరడం.. ప్రియాంక జీవితాన్ని మార్చేసింది.



చారిత్రక నేపథ్యం, పురాణేతి హాసాలతో నిర్వహించే సంగీత, నృత్య బ్యాలేల మాదిరిగా అద్భుతమైన కథాంశం కలిగిన 'మయ'సంగీత నాటక ప్రదర్శనలతో ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల్లోని పిల్లల్లో మంచి మార్పును తీసుకురావచ్చన్నది అహోనా కృష్ణ ఆలోచన. అందుకే మయ నాటక ప్రదర్శనల్లో  ప్రావీణ్యం కలిగిన ప్రియాంకను తమ సంస్థలో చేర్చుకునేందుకు అహోనా ఆసక్తి చూపించారు. ఎన్నో విలువలతో కూడిన మయ సంగీత నాటకాలను తమ సంస్థలోని పిల్లలకు నేర్పించాలని ప్రియాంకను కోరారు. కళల్లో ముందే ప్రావీణ్యం లేని  పిల్లలకు  సైతం ఈ ప్రదర్శనలతో వారిలో విజ్ఞానాన్ని, విలువలను పెంచవచ్చన్నది  అహోనా ఆకాంక్ష. పిల్లలు చదువులోనూ ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతో దోహద పడతాయని ఆమె భావన.



అహోనా క్రిష్ణ కోరిక మేరకు 'టీచ్ ఫర్ ఇండియా'  లో చేరిన ప్రియాంక పిల్లలకు పాఠాలు చెప్పడంలో అత్యంత ఉత్సాహాన్ని కనబరిచింది. మయ మ్యూజికల్ యాక్టర్, కో డైరెక్టర్ నిక్ డాల్టన్ ప్రియాంకకు అంతకు ముందే  ఎన్నోసార్లు యూ.డబ్ల్యూ సీ కి ధరఖాస్తు చేసుకోమని సలహా ఇచ్చినా పెద్దగా పట్టించుకోని ప్రియాంక, టీచ్ ఫర్ ఇండియాలో చేరిన తర్వాత ఆత్మస్థైర్యాన్ని ప్రోది చేసుకుంది. తనంత తానుగా నిర్ణయాలను తీసుకునే స్థాయికి ఎదిగింది.దీంతో యూ డబ్ల్యూ సీ స్వయంగా టీచ్ ఫర్ ఇండియా నుంచి ధరఖాస్తులను కోరడంతో ఈ సదవకాశాన్ని  వినియోగించుకుంది. ఇటలీలో అధ్యయనం చేసే అవకాశం రావడంతో రెండేళ్ళ అధ్యయనం అనంతరం ప్రియాంక ఓ మనస్తత్వవేత్త గా మారి భవిష్యత్తులో తనవంటి ఎందరో పిల్లలు ఎదిగేందుకు తోడ్పడతానని చెప్తోంది.



ప్రియాంక వంటి ఔత్సాహికులు... సమాజానికి సేవ చేయాలనే ఆలోచనలో ఉన్న వారు... ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకునే సమయం  ఆసన్నమైంది. 'టీచ్ ఫర్ ఇండియా' తమ సంస్థలో  2016 బ్యాచ్ కోసం ధరఖాస్తులను స్వీకరించేందుకు ప్రకటన విడుదల చేసింది. ఇంక దేనికి ఆలస్యం వెంటనే 'టీచ్ ఫర్ ఇండియా' (http://apply.teachforindia.org/user/register)  వెబ్ సైట్ లో  ధరఖాస్తులను పంపించండి. మీలోని ప్రతిభను సమాజానికి పంచుతూ మీ ఆశయాలను నెరవేర్చుకోండి



 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top