'చాలా బాధపడుతున్నాం..దయచేసి కలిసిపోండి'


ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోవద్దని, మీలో మీకు చీలికలు రావొద్దని ఆప్ నేతలను విదేశాల్లో ఉన్న భారత ఆప్ మద్దతుదారులు కోరుతున్నారు. వివిధ సామాజిక అనుసందాన వెబ్ సైట్ల ద్వారా దేశ విదేశాల్లోని ఉన్న ఆప్ అభిమానులంతా ఆప్ టీం ఎప్పటికీ కలిసుండాలని కోరుకుంటున్నారు. అంతా ఒక టీంగా ఏర్పడి ఒకరికొకరు కలిసిపోయి, ఐకమత్యంగా ఉండండి అని ఆప్ నేతలకు విన్నవిస్తున్నారు.


 


"మీరు సాధించిన అఖండ విజయంతో దేశ పాలన విధానంలో మార్పులు వస్తాయని మేమంతా ఆశించాం. మీలో మీకు గత కొద్ది కాలంగా వస్తున్న విభేదాలు చూసి చాలా బాధపడుతున్నాం. దయచేసి కలిసిపోండి' అని విదేశాల్లో భారతీయులు కోరుకున్నారు. దాదాపు 32 దేశాలనుంచి ఆప్ జాతీయ కార్యవర్గ సభ్యలకు వారు ప్రత్యేకంగా ఈమెయిల్స్ పంపించారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top