వ్యామోహమే అంత పనిచేయించింది..

వ్యామోహమే అంత పనిచేయించింది.. - Sakshi


వడోదర:  ఖరీదైన మొబైల్ ఫోన్ అంటే మోజు... విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఆరాటం ...  లేటెస్ట్  ఎలక్ట్రానిక్  గాడ్జెట్స్తో  హల్చల్ చేసే స్నేహితులు....వెరసి టీనేజ్ పిల్లల జీవితాలతో చెలగాటం...  సెల్ఫోన్,ఇతర ఖరీదైన వస్తువుల మోజులో పడి  13 ఏళ్ల వయసులోనే  వ్యభిచార ఉచ్చులోకి దిగిన  ఉదంతం  ఆందోళన కలిగిస్తోంది.




సుభాన్పురా ఏరియాలో  గ్రాసరీ దుకాణం నడుపుకునే తల్లి  తన పదమూడేళ్ల కూతురు గర్భవతి అనే తెలుసుకొని  షాకై అయింది.  కూతురు చెప్పిన కారణాలు విని నిర్ఘాంత పోయింది.  అలా  చేయడం తప్పని వారించింది.  వ్యభిచారం నేరమని.. పద్ధతి మార్చుకోమని  బతిమలాడుకుంది.. కానీ ఆ అమ్మాయి వినలేదు. మరింత విచ్చలవిడిగా ప్రవర్తించింది. దీంతో  ఎలాగైనా ఆమెను  దారిలో పెట్టాలనుకున్నతల్లి మేనమామగారింటికి పంపించివేసింది. కానీ  ఆత్మహత్య చేసుకుంటానని కూతురు బెదిరించడంతో  ఇక చివరి ప్రయత్నంగా .  గుజరాత్ లోని అభయం టోల్ఫ్రీ నెం.  185 ను  సంప్రదించింది. ఫ్యామిలీ  కౌన్సెలర్  కౌన్సెలింగ్లో  ఈ వెలుగులోకి వచ్చింది.  


నా స్నేహితులు  దగ్గర మంచి మంచి  ఫోన్లు ఉన్నాయి...నా క్కూడా ఉంటే బావుండు అనుకున్నా.. వాటికోసమే ఈ పని చేశా...అమ్మ షాప్కెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చే లోపే......ఇలా కౌన్సెలింగ్లో ఆ  అమ్మాయి చెప్పిన మాటలు విని  కౌన్సెలర్కే దిమ్మ తిరిగింది.  ఆమె దగ్గర  విలువైన ఫోన్లు, ఖరీదైన ఎలక్ట్రానిక్స్ పరికరాలు  చాలా ఉండడం చూసి విస్తుపోవడం  కౌన్సెలర్ వంతైంది.

భర్త చనిపోవడంతో..కుటుంబ భారం నెత్తిన పడి కూతుర్ని అంతగా పట్టించుకోలేకపోయానని  తల్లి వాపోతోంది.



కాగా ఆనంద్  ప్రాంతానికి   వీరు వ్యాపారం రీత్యా  వడోదరాలో స్థిరపడ్డారు.  ఈ అమ్మాయిని పసిపాపగా ఉన్నపుడే దత్తత తీసుకున్నారు. కాగా మూడేళ్ల  క్రితం ఆ అమ్మాయి తండ్రి చనిపోయినట్లు తెలుస్తోంది.


వినిమయ సంస్కృతి పిల్లాపెద్దా అందరినీ ప్రభావం చూపుతుందనీ మానసిక నిపుణులంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. స్నేహపూర్వక  పర్యవేక్షణ అవసరమంటున్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top