చిరుత నుంచి ఎలా తప్పించుకున్నాడో చూడండి

చిరుత నుంచి ఎలా తప్పించుకున్నాడో చూడండి - Sakshi


భువనేశ్వర్‌: సాధారణ సమయంలో చిన్నపిట్టగోడమీద నుంచి దూకేందుకే జంకుతుంటాం. కానీ ప్రాణం మీదకొస్తే మాత్రం దేన్నీ లెక్క చేయం. మనకు తెలియకుండానే అంత పవర్‌ నిగూఢంగా దాగి ఉంటుంది. ఈ సీన్‌ చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. తన ప్రాణాలు చిరుత బారి నుంచి రక్షించుకునేందుకు ఓ రెస్క్యూ ఆఫీసర్‌ ఇంటిపై నుంచి కిందికి దూకేశాడు. పులిపంజా నుంచి రెప్పపాటులో తప్పించుకున్నాడు. ఈ ఘటన  ఒడిశాలోని కంతబాంజి అడవీ ప్రాంతానికి సమీపంలోని కురులి అనే గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..



కురులి అనే గ్రామంలోని ఓ పశువుల కొట్టంలోకి చొరబడింది. గ్రామంలోని ఓ యువతిని మరో ముగ్గురుని గాయపరిచింది. అనంతరం కనిపించకుండా పోయిన ఆ చిరుత పన్నెండు గంటలపాటు గాలింపులు జరిపాక కనిపించింది. దానిని బంధించేందుకు పట్టి బంధించేందుకు ప్రత్యేక బృందం వచ్చింది. ఆ తర్వాత ఆ చిరుత ఒక ఇంటిపై నుంచి మరో ఇంటి మీదకు దూకుతూ హల్‌ చల్‌ చేస్తుండగా దానిని ఎటు వెళ్లకుండా గ్రామస్తులంతా చుట్టూ కర్రలతో వెంబడిస్తున్నారు. అదే సమయంలో ఓ ఇంటిపైన విజయానంద కుంత అనే ఫారెస్ట్‌ అధికారి ఉండగా ఒక్కసారిగా ఆ చిరుత అతడిపైకి దూకింది. ఆ క్రమంలో దాని నుంచి తప్పించునేందుకు అతడు అమాంతం కిందికి దూకేసి ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం ఆ చిరుతకు మత్తు మందిచ్చి బంధించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top