వాళ్లను 'ఆమె కాదు.. అతడు కాదు' అనొద్దు

వాళ్లను 'ఆమె కాదు.. అతడు కాదు' అనొద్దు


- 'థర్డ్ జెండర్' హక్కుల బిల్లుకు కీలకాంశాల చేర్పు


 


ఢిల్లీ: భిక్షాటన చేయాలని ట్రాన్స్ జెండర్లపై ఒత్తిడి తేవడం ఇక నుంచి అట్రాసిటీ (వేధింపుల) కిందకు రానుంది. వారిని వివస్త్రులుగా చేయడం, కించపరిచేలా మాట్లాడటం, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించడం వంటివి ఇకపై నేరాలుగానే పరిగణిస్తారు. అంతే కాదు 'ఆమె' కాదు, 'అతడు' కాదు.. అంటూ వాళ్లను అవహేళన చేయడం, ఇల్లు లేదా గ్రామం నుంచి వెళ్లగొట్టడం లాంటి చర్యలు మున్ముందు ఆక్షేపణీయం.


ఏళ్లుగా సమాజంలో తమ ఉనికి కోసం పోరాడుతున్న ట్రాన్స్ జెండర్ల కృషి ఫలించి ప్రభుత్వం వారిని 'థర్డ్ జెండర్' గా గుర్తించిన విషయం తెలిసిందే. కాగా, 2015లో రూపొందించిన ట్రాన్స్ జెండర్ల హక్కుల బిల్లులో తాజాగా మరికొన్ని సూచనలు పొందుపర్చారు. త్వరలోనే ఇది చట్టబద్ధం కానుందని సామాజిక న్యాయం, సాధికారత శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.


ట్రాన్స్ జెండర్ల హక్కులకు సంబంధించి కొన్ని అంశాలు:


  • ట్రాన్స్ జెండర్లు పుట్టుకతోనే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందనివారైతే.. వారి సామాజికవర్గాన్ని బట్టి బీసీలు లేదా ఓబీసీలుగా గుర్తించబడతారు.

  • బిల్లు ప్రకారం ట్రాన్స్ జెండర్లు థర్డ్ జెండర్లుగా పరిగణించబడతారు. అయితే వారు ఆడ లేక మగ లేక ట్రాన్స్ జెండర్లలో ఏ వ్యక్తిగా గుర్తింపబడాలో నిర్ణయించుకునే హక్కు ప్రభుత్వం వారికి కల్పిస్తోంది.  

  • రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్రపాలిత ప్రభుత్వ స్థాయి అధారటీల నుండి వారు సరైన గుర్తింపు సర్టిఫికెట్ను పొందాల్సి ఉంటుంది. తమిళనాడు సంక్షేమ బోర్డుల ద్వారా ఈ గుర్తింపు సర్టిఫికెట్లు మంజూరు చేయబడతాయి.

  • ఈ గుర్తింపు సర్టిఫికెట్ల ద్వారా వారు బర్త్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పోర్టులు పొందవచ్చు.

  • ఇక అందరు విద్యార్థులు పొందుతున్నట్లే ట్రాన్స్ జెండర్లు కూడా ఉపకార వేతనాలు, ఉచిత పాఠ్య పుస్తకాలు,  ఉచిత హాస్టల్ వసతివంటివి పొందుతారు.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top