అదృశ్య నిధులే నడిపిస్తున్నాయ్‌

అదృశ్య నిధులే నడిపిస్తున్నాయ్‌ - Sakshi


70 ఏళ్లుగా వీటిని నియంత్రించడంలో విఫలమయ్యాం: జైట్లీ

ఎలక్టోరల్‌ బాండ్‌ల యంత్రాంగం దిశగా చర్యలు




న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు అందే నిధులకు సంబంధించి ఎలక్టోరల్‌ బాండ్‌ ల అమలు కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటుకు  చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. పార్టీలకు అందే నిధులు పారదర్శకంగా ఉండటానికి ఉద్దేశించిన ఈ విధానానికి సంబంధించి రాజకీయ పార్టీల నుంచి ఒక్క ప్రతిపాదనా రాలేదన్నారు. గత 70 ఏళ్లుగా దేశ ప్రజాస్వా మ్యాన్ని అదృశ్య నిధులే నడిపిస్తు న్నాయని,  ప్రజాప్రతినిధులు, ప్రభుత్వా లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల కమిషన్‌ వీటిని నియంత్రించడంలో విఫలమయ్యా యని అన్నారు. రాజకీయ పార్టీల కు వచ్చే విరాళాలకు సంబంధించి పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసిన జైట్లీ.. పార్టీలకు వచ్చే నగదు విరాళాలను రూ.2 వేలకు పరిమితం చేయడమే కాక ఎలక్టోరల్‌ బాండ్లను ప్రవేశపెట్టారు.



ప్రస్తుత విధానమే నచ్చిందేమో..

శనివారం ఢిల్లీ ఎకనామిక్స్‌ కాంక్లేవ్‌లో జైట్లీ మాట్లాడుతూ..‘నిధులకు సంబంధించి మెరుగైన ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా.. పార్టీలకు మౌఖికంగా.. రాతపూర్వకంగా కోరాను. ఇప్పటి వరకూ ఎవరూ ఒక్క ప్రతి పాదనతో ముందుకు రాలేదు. ఎందు కంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థతో వీరంతా సంతృ ప్తిగా ఉన్నట్టున్నారు’’అని అన్నారు. రాజకీ య వ్యవస్థలోకి వస్తున్న అదృశ్య నిధులకు అడ్డుకట్ట వేయలేకపోయామని, సంబంధించి  ప్రతీ ప్రతిపాదనలో ఏదో లోపం ఉండటంతో ఈ రోజుకూ పరిష్కా రం దొరకలేదన్నారు. గత బడ్జెట్‌లో తాను ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించానని, ఈ దిశగా ప్రస్తుతం చర్యలు తీసుకుంటు మన్నారు.



ఏమిటీ ఎలక్టోరల్‌ బాండ్లు..

బడ్జెట్‌లో ప్రకటించిన ప్రకారం.. ప్రతిపాది త ఎలక్టోరల్‌ బాండ్లు వడ్డీ చెల్లించే రుణ పత్రాలుగా కాక.. ఒక ప్రామిసరీ నోటుగా ఉంటాయి. వీటిని అధీకృత బ్యాంకులు అమ్ముతాయి. వచ్చిన నిధులను సంబం ధిత రాజకీయ పార్టీలకు చెందిన ఖాతాల్లో నిర్దేశిత కాలానికి డిపాజిట్‌ చేస్తాయి. ఈ బాండ్లపై దాత పేరు ఉండదు. బ్యాంకుల ద్వారా నిధులు రావడం వల్ల పన్ను చెల్లిం చిన నగదు మాత్రమే రాజకీయ వ్యవస్థలోకి వస్తుంది.



జీఎస్టీతో పన్ను పరిధి విస్తృతం

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలులోకి రావ డంతో పన్నుల పరిధి విస్తృతమైందని, వీటి వల్ల నగదు లావాదేవీలు చేయడం కష్టంగా మారుతోందన్నారు. ఇది పన్నుల వ్యవస్థ పరిధిని పెంచడానికి.. పన్ను చెల్లిం పులను ప్రోత్సహించడానికి దోహదం చేస్తుందని చెప్పారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనంతో పాటు దేశంలోని వివిధ బ్యాంకుల్లోని నల్లధనాన్ని వెలికి తీసేం దుకు చట్టాల ను కఠినతరం చేశామని, డొల్ల కంపెనీలపైనా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో పన్ను చెల్లించవలసిన వారిలో అత్యధికులు ఆ పని చేయడం లేదని, వ్యవస్థకు బయటే భారీగా నగదు చలామణి అవుతోందని వివరించారు. ఆర్థిక బిల్లు ద్వారా కొన్ని మార్పులను ప్రకటిస్తున్నా.. వాటి ప్రభా వం స్వల్పంగా ఉంటోందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top