ఫోకస్

ఫోకస్ - Sakshi


ఐఎస్‌ఐఎస్ దళాల్లో భారత్ సహా దాదాపు 100 దేశాలకు చెందిన 20,000 మంది విదేశీ ‘ఫైటర్లు’ ఉన్నారని.. అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ బుధవారం నాడు వెల్లడించారు. ఇందులో కనీసం 3,400 మంది పశ్చిమ దేశాల నుంచే వెళ్లినట్లుపేర్కొన్నారు. అత్యధికంగా సౌదీ అరేబియా నుంచి 7,000 మంది ఉంటే.. ట్యునీసియా నుంచి 5,000 మంది వరకూ ఉన్నట్లు అంచనా. బ్రిటన్, రష్యా, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, బెల్జియం, ఆస్ట్రేలియా, స్వీడన్, నార్వే, కెనడా, నెదర్లాండ్స్, అమెరికా, డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఇజ్రాయెల్, స్పెయిన్‌లలో ఒక్కో దేశం నుంచి అత్యధికంగా 2,000 మంది కనీసంగా 100 మంది ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల్లో ఉన్నట్లు సమాచారం.

 

ఐఎస్‌ఐఎల్‌కు 200 కోట్ల డాలర్లకు పైగా నిధులు, ఆస్తులు ఉన్నాయని ఇరాక్ నిఘా విభాగం గత ఏడాది గుర్తించింది. అంటే భారత కరెన్సీలో రూ. 12,000 కోట్లకు పైమాటే. దీంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన జిహాదీ ఉగ్రవాద సంస్థగా ఐఎస్‌ఐఎల్ రికార్డుల్లోకి ఎక్కింది.

 

ఇరాక్‌లో ప్రస్తుతం సుమారు 300 చమురు బావులు ఈ సంస్థ ఆధీనంలో ఉన్నాయి. సిరియా చమురు ఉత్పత్తిలో 60 శాతం ఈ సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయింది

 

 

2013లో స్థాపితమైన ‘ఇస్లాం మీడియా ఫౌండేషన్’ ద్వారా ప్రధానంగా ప్రచారం సాగిస్తోంది. ఇక గత ఏడాది పశ్చిమ దేశాల్లో ప్రచారం లక్ష్యంగా ‘అల్-హయత్ మీడియా సెంటర్’ను ప్రారంభించింది. ఇది ఇంగ్లిష్, జర్మన్, రష్యన్, ఫ్రెంచ్ భాషల్లో ప్రచార కార్యక్రమాలు పర్యవేక్షిస్తుంది. గత ఏడాది ‘దబీఖ్’ అనే ఇంగ్లిష్ డిజిటల్ మేగజైన్‌ను తెరపైకి తెచ్చింది. దాదాపు 23 భాషల్లో ఈ సంస్థ ప్రచారం సాగుతోందని ఎఫ్‌బీఐ వెల్లడించింది. ఇక ట్వీటర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాను వినియోగించుకోవటంలో అమెరికాలో అగ్రస్థాయి కంపెనీలకన్నా ఐఎస్‌ఐఎల్ చాలా ఆధునికంగా వ్యవహరిస్తోందని నిపుణులు చెప్తున్నారు.

 

 ప్రాబల్యం.. విస్తరణ: ఇరాక్, సిరియా, సినాయి, తూర్పు లిబియాల్లోని పలు ప్రాంతాలు తమ ఆధీనంలో ఉన్నట్లు ఐఎస్‌ఐఎస్ ప్రకటించుకుంది. అలాగే.. అల్జీరియా, లెబనాన్, జోర్డాన్, సౌదీఅరేబియా, యెమెన్, టర్కీల్లో పలు ప్రావిన్సులు తన పరిధిలోకి వస్తాయని.. అక్కడ తమ సభ్యులు ఉన్నారని పేర్కొంది. అయితే వాస్తవానికి ఈ దేశాల్లోని ఏ ప్రాంతంలోనూ ఐఎస్‌ఐఎల్ నియంత్రణ లేదు.

 

 ప్రపంచ శాంతికి, సుస్థిరతకు ఐఎస్‌ఐఎస్ పెను ముప్పుగా పరిణమిస్తోందని.. ప్రపంచ దేశాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 దేశాలు సంకీర్ణంగా ఏర్పడి చర్యలు ప్రారంభిస్తున్నాయి. ఐఎస్‌ఐఎస్ వ్యతిరేక సంకీర్ణంగా దీనిని అభివర్ణిస్తున్నారు. అమెరికా నేతృత్వంలో యూరోపియన్ యూనియన్, నాటో దేశాలతో పాటు.. కోఆపరేషన్ కౌన్సిల్ ఫర్ ది అరబ్ స్టేట్స్ ఆఫ్ ది గల్ఫ్‌లోని ఆరు సభ్యదేశాలతో పాటు.. సభ్యత్వం పెండింగ్‌లో ఉన్న జోర్డాన్, మొరాకోలు కూడా ఈ సంకీర్ణంలో భాగమయ్యాయి.

 

 ఖాలిఫ్‌ను అర్హతలు, సమర్థతను బట్టి ముస్లింలు లేదా వారి ప్రతినిధులు ఎన్నికల ద్వారా కానీ, ఏకాభిప్రాయం ద్వారా కానీ ఎన్నుకోవాలనేది సున్నీ ముస్లింల సిద్ధాంతం. అలాకాదు.. మహమ్మద్ ప్రవక్తకు నేరుగా వారసులైన వారి నుంచి దేవుడు ఎంపిక చేసిన ‘ఇమామ్’ మాత్రమే ఖాలీఫ్ కావాలన్నది షియా ముస్లింల సిద్ధాంతం. మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత అప్పటి ముస్లిం వర్గాల పెద్దలు సమావేశమై.. అబుబకర్‌ను ఖాలీఫ్‌గా ఎంపకచేశారు. కానీ ముస్లింలలో కొందరు.. మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన అలీ వైపు మొగ్గుచూపారు. అలీ అనుచరులకు ‘షియాట్ అలీ’ (అలీ అనుచరులు) - షియాలు అనే పేరు వచ్చింది. అబుబకర్ మరణం తర్వాత.. 656లో అలీ నాలుగో ఖాలీఫ్ అయ్యారు. కొందరు ముస్లింలు - ప్రస్తుత సున్నీలకు పూర్వీకులు - అలీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. 661 సంవత్సరంలో అలీ హత్యకు గురయ్యారు. ఇలా.. మెజారిటీ సున్నీలకు, మైనారిటీ షియాలు శాశ్వత శత్రుత్వంతో రెండు వర్గాలుగా విడిపోయారు.

 

ప్రపంచంలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ టైస్ట్‌గా ఉన్న అబుబకర్ అల్-బగ్దాదీ అసలు పేరు ఇబ్రహీం ఇబిన్ అవ్వాద్ అల్-బాద్రి అల్-సమర్రాయి. 1971లో ఇరాక్‌లోని సమర్రా నగరంలో పుట్టాడు. చదువుకునే రోజుల్లో తమతో కలిసి ఫుట్‌బాల్ ఆడేవాడని నాటి సహచరులు చెప్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top