మొట్టమొదటి బడ్జెట్ ఎప్పుడో.. ఎవరో తెలుసా?

మొట్టమొదటి బడ్జెట్ ఎప్పుడో.. ఎవరో తెలుసా?


స్వతంత్ర భారత దేశానికి మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా? నాటి ఆర్థికమంత్రి షణ్ముఖం చెట్టి. ఆయనే 1948-49 సంవత్సరంలో తాత్కాలిక బడ్జెట్, ఇంటెరిమ్ బడ్జెట్ అనే పదాన్ని మొదటిసారి తన బడ్జెట్ ప్రసంగంలో పరిచయం చేశారు.



ఈస్టిండియా కంపెనీ నుంచి అధికార పగ్గాలు బ్రిటిష్ ప్రభుత్వానికి చేతులు మారిన తర్వాత వార్షిక బడ్జెట్‌ను తొలిసారిగా 1860 ఏప్రిల్ 7న ప్రవేశపెట్టింది. బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటల సమయంలో వెలువరించడం అనే సంప్రదాయాన్ని 1924లో సర్ బాసిల్ బ్లాకెట్ ప్రారంభించారు. బడ్జెట్ తయారీకి రాత్రంతా పనిచేసిన ఉద్యోగులకు కొంత ఉపశమనం ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత క్రమంగా అది ఉదయానికి మారిపోయింది.

 



బడ్జెట్ చరిత్ర

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముఖం చెట్టి 1947 నవంబర్ 26 సాయంత్రం 5 గంటలకు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశ మొదటి బడ్జెట్‌ను కేవలం ఏడున్నర నెలలకు మాత్రమే రూపొందించారు. దీనిని 1947 ఆగస్టు 15 నుంచి 1948 మార్చి 31 వరకు రూపొందించారు. గణతంత్ర భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్‌ను 1950 ఫిబ్రవరి 28న జాన్ మత్తయ్ సమర్పించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top