ఫేస్‌బుక్‌లో పరిచయం.. ఆపై అత్యాచారం

ఫేస్‌బుక్‌లో పరిచయం.. ఆపై అత్యాచారం - Sakshi


కేకేనగర్(చెన్నై): ఫేస్‌బుక్‌లో యువతులతో పరిచయం పెంచుకుని వారిపై అత్యాచారం జరిపి నగదు దోపిడీలకు పాల్పడుతున్న  మోసగాడిని, అతడి భార్యను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తమిళనాడులోని తిరుపూర్ జిల్లా వీరపాండి సమీపంలోని నెచ్చిపాలెయంకు చెందిన గురదీన్ దయాళన్(27) చెన్నైకు చెందిన ప్రియదర్శిని(25)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.



తర్వాత విలాస జీవితానికి అలవాటుపడి అడ్డదారిలో నగదు సంపాదించడానికి పథకం పన్నాడు. ఫేస్‌బుక్ ద్వారా అమ్మాయిలను ఆకర్షించి, వారికి తన భార్యను అక్క అని పరిచయం చేసేవాడు. వారితో సాన్నిహిత్యం పెంచుకుని అత్యాచారం జరిపి, వారి వద్ద ఉన్న నగలను దోపిడీ చేసేవాడు. 2014 నుంచి పదిమందికి పైగా యువతులను మోసం చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top