చూపు తగ్గుతోంది..!


న్యూఢిల్లీ: నగరంలో కంటిచూపు తగ్గుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పది సంవత్సరాల లోపు చిన్నారుల్లో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. పదేళ్లలోపు ఉన్న వంద మంది చిన్నారులను పరిశీలిస్తే.. సుమారు ఎనిమిది మందికిపైగా పిల్లలు దృష్టిలోపంతో బాధపడుతున్నారు. కొందరిలో కంటిఅద్దాలు సమకూర్చినా చూపు బాగుపడని పరిస్థితి ఉంది. పిల్లల్లో చూపు తగ్గడానికి అనేక కారణాలున్నారుు.



 ప్రధానంగా కంటిచూపు తగ్గడానికి జన్యుపర సమస్య ఒకటైతే, విటమిన్-ఏ లోపం, తగినంత వెలుతురు లేని గదుల్లో విద్యాభ్యాసం చేయడం, అదేపనిగా వీడియో గేమ్స్, కంప్యూటర్, టీవీ చూడటం వ ంటివి కూడా కారణమవుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కంటిచూపు తగ్గకుండా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో  ఆరునెలలకో సారి ఏ-విటమిన్ పిల్లలకు అందిస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం ఉండడం లేదు. విటమిన్ ‘ఏ’ ద్రవం అందించే కార్యక్రమం పకడ్బందీగా చేపట్టకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఆరోపణలున్నారు.



 పిల్లల చూపు తగ్గకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తగిన  జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. కంటిచూపు సమస్యతో బాధపడుతున  వారిలో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు.. వీరిలో ఎక్కువ మంది ఉన్నత వర్గాలకు చెందిన వారే ఉంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య రెండు లక్షల వరకు ఉంది. వీరిలో నాలుగు శాతం పదేళ్ల వయసులోపు  పిల్లలు ఉండగా ... 11 నుంచి 16 సంవత్సరాల లోపు వారు ఎక్కువగా ఉంటున్నారు.



 తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

 ఆహారంలో విటమిన్ ఏ, కెరోటినాయిడ్లు, ట్యూటిన్ అధికంగా ఉండే ఆకుకూరలు, క్యారెట్, ద్రాక్ష, బొప్పాయి, చిలగడ దుంపలు వంటి తినడంతో కంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ఏ పనిచేస్తున్నా గంటకోసారి దూరంగా ఉన్న ఏదైనా వ స్తువును తదేకంగా చూడాలి. తర్వాత దగ్గరగా ఉన్న వస్తువును చూడాలి. ఇలా ఐదారుసార్లు చేయడంతో కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. పనిలో పడిపోయి కళ్లను మూసి తెరుస్తుండడం మరిచిపోవద్దు. పిల్లలు, పెద్దలు ఎలాంటి సమస్యలేకపోయినా క్రమం తప్పకుండా కళ్లను పరీక్ష చేయించుకోవాలి. కంటి సమస్యలు వచ్చిన ప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లలకు దృష్టిలోపం రాకుండా ఉండేందుకు పెద్దలూ జాగ్రత్తలు తీసుకోవాలి.



 చూపు తగ్గడానికి కారణాలు ఇవీ..

పిల్లలకు పాలు, గుడ్లు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పుదినుసులు, అసవరం అయినంతమేరకు తీసుకోకపోవడంతో ఏ-విటమిన్, కాల్షియం స్థాయి తగ్గిపోయి కంటి చూపుతోపాటు ఇతర ఆరోగ్యసమస్యలూ వస్తాయి. వెలుతురు, గాలి లేని ఇరుకుగదుల్లో విద్యాభ్యాసం చేయడం.

గతంలో బ్లాక్‌బోర్డుపై చాక్‌పీస్‌తో అక్షరాలు రాసేవారు. ఈ అక్షరాలు కళ్లకు ఇబ్బంది కలగకుండా పెద్దగా కూడా కనిపించేవి. తరగతి గదిలో చివరివరుసలో కూర్చున్నా..అక్షరాలు స్పష్టంగా కనిపించేవి. ఇప్పుడు బ్లాక్ బోర్డుల స్థానంలో వైట్‌బోర్డుపై మార్కర్‌తో చిన్న అక్షరాలు రాస్తూ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఫలితంగా కళ్లపై ఒత్తిడిపడి నరాలపై ప్రభావం చూపి చూపు తగ్గుతోంది.



{పస్తుతం పుస్తకాల్లో అక్షరాలు కూడా మరీ చిన్నవిగా ముద్రిస్తున్నారు. ఇది కూడా కొంతవరకు ప్రభావం చూపుతోంది.



టీవీ, కంప్యూటర్, వీడియో గేమ్స్ ఆడే పిల్లల్లో  ఈ కంటిచూపు సమస్య ఉత్పన్నమవుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top