షరతులతో ‘బడ్జెట్‌’కు ఈసీ అనుమతి

షరతులతో ‘బడ్జెట్‌’కు ఈసీ అనుమతి - Sakshi


న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వానికి ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. అయితే, ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి పథకాలు, హామీలు ప్రకటించకూడదని సూచించింది. ఆర్థిక మంత్రి ప్రసంగంలో ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వ విజయాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు ఉండకూడదంది.


2009లో ఓటాన్  అకౌంట్‌ ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ విధమైన బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని సూచించింది. ‘ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలనే ప్రక్రియకు విఘాతం కల్పించకుండా.. ఈ ఐదు రాష్ట్రాల్లో ఓటర్లను ప్రభావితం చేసే ఏ ప్రకటనా లేకుండా బడ్జెట్‌ ఉండాలని ఆదేశిస్తున్నాం’ ఎన్నికల సంఘం కేబినెట్‌ సెక్రటరీ పీకే సిన్హాకు తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top