'సంక్షేమ పథకాలతో ఎప్పటికీ ప్రజల మనస్సుల్లో ఉండిపోతాం'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జాతీయంకథ

డస్ట్ సక్కింగ్ మిషన్‌తో రోడ్లు శుభ్రం

Sakshi | Updated: June 05, 2013 02:52 (IST)
India :తాడిపత్రి (అనంతపురం), న్యూస్‌లైన్ :పట్టణంలోని రోడ్లపై పేరుకుపోయే చెత్త(కసువు)ను ఊడ్చేందుకు తాడిపత్రి మున్సిపాలిటీ అధికారులు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రూ.18.3 లక్షల వ్యయంతో పూనేలో కొనుగోలు చేసిన కమ్ అవిదా కంపెనీకి చెందిన ‘డస్ట్ సక్కింగ్ మిషన్(చెత్త ఊడ్చే యంత్రాన్ని)’ను సోమవారం పట్టణానికి తీసుకొచ్చారు. గంటకు 6 కిలోమీటర్ల మేర రోడ్లను ఈ యంత్రం ఊడ్చి శుభ్రం చేస్తుంది. రెండు, మూడు రోజుల్లో పట్టణంలో లాంఛనంగా ఈ మిషన్‌తో పనులు ప్రారంభించనున్నారు.

రానున్న రోజుల్లో పారిశుద్ధ్య కార్మికుల కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. తాడిపత్రిలో మొత్తం 34 వార్డులుండగా, 1.20 లక్షల మంది జనాభా ఉన్నారు. పట్టణ పరిధిలో 61 మంది రెగ్యులర్, 130 మంది కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. తగినంత మంది కార్మికులు లేనందున కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్య వేధిస్తోంది. అంతేకాకుండా పారిశుద్ధ్య పనులు చేసేందుకు కార్మికులు ఆసక్తి చూపక పోవడంతో డస్ట్ సక్కింగ్ మిషన్‌ను కొన్నారు. కాగా ఈ యంత్రం ద్వారా రోడ్లు ఊడ్చే ప్రాంతాల్లో పని చేస్తున్న కార్మికులను మురికివాడల పరిధిలో పారిశుద్ధ్య పనులకు వినియోగించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు.

తొలిసారిగా ఈ ప్రాంతాల్లో..

తొలుత మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు వరకు, నంద్యాల రోడ్డు, పుట్లూరు, యల్లనూరు, అశోక్ పిల్లర్ సర్కిళ్లు, మెయిన్ బజారు, సంజీవనగర్ తదితర ప్రధాన రోడ్లలో ఈ యంత్రం ద్వారా చెత్త ఊడ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చెత్త సేకరణ, ప్లాస్టిక్ నిషేధం, మధ్యాహ్న భోజన పథకం అమలులో తాడిపత్రి మున్సిపాలిటీ రాయలసీమ జిల్లాల్లోనే ప్రథమ స్థానంలో ఉంది. ఇపుడు ఈ సరికొత్త యంత్రాన్ని ప్రవేశపెట్టి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుందని మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్ రాంమ్మోహన్‌రెడ్డి న్యూస్‌లైన్‌తో అన్నారు.

Advertisement

Advertisement

మీ చుట్టూ వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

ఆ గొంతు మీది కాదా?

Advertisement

Advertisement

© Copyright Sakshi 2015. All rights reserved.