నగరంలో 225 డెంగీ కేసులు

నగరంలో 225 డెంగీ కేసులు


న్యూఢిల్లీ: నగరం కాలుష్యకాసారంగా మారిపోయింది. విషజ్వరాలకు నెలవుగా మారింది. రోజురోజుకూ జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. అత్యంత ప్రమాదకరమైన డెంగీ నగర ప్రజలను వణికిస్తోంది. ఒక్క వారంలోనే 200 డెంగీ కేసులు నమోదు అయ్యాయి.  ఢిల్లీలో అక్టోబర్ 18వ తేదీ నుంచి ఇప్పటి వరకు 225 కేసులు నమోదు అయ్యాయి. అక్టోబర్ 11వ తేదీ వరకు 158 కేసులు ఉండగా, ఈ వారం రోజుల్లో కేసులు అత్యధికంగా నమోదైనట్లు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలోనూ డెంగీ కేసులు నమోదు అయ్యా యి. ఉత్తర కార్పొరేషన్ పరిధిలో 44 కేసులు, 90 (దక్షిణ కార్పొరేషన్), 37 (తూర్పు), మరో 34 డెంగీ కేసులు నగర శివారు ప్రాంతలల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో, మరో 20 కేసులు సమీప రాష్ట్రాల్లో నమోదు అయ్యాయి. అదేవిధంగా నగరంలో 60 మలేరియా కేసులు కూడా నమోదు అయ్యాయి.

 

 కలుషిత జలాల కారణంగా..

 నగరంలో కలుషిత జలాల కారణంగా ప్రజలు రోగాల బారినపడుతున్నారు. పశ్చిమ ఢిల్లీలోని శ్రీనగర్‌లో ఉంటున్న రుషి ఖడాఫీ అనే చిన్నారి డెంగీ సోకింది. ఇతడు సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు. గత సంవత్సరం నగరంలో 5,500ల డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో 6 మంది మృతి చెందినట్లు ఎస్‌డీఎంసీ రికార్డులు తెలియజేస్తున్నాయి. నగరంలో ఎక్కువగా అంటువ్యాధులు తీవ్రమవుతున్నాయి. ఈ అక్టోబర్ నెలలో అధికంగా డెంగీ కేసులు నమోదయ్యాయి. 18వ తేదీ వరకు 105 కేసులు నమోదు అయ్యాయి.

 

 దోమల వృద్ధి కేంద్రాలు

 నగరంలో డెంగీకి కారణమైన దోమల వృద్ధి కేంద్రాలను ఉత్తర ఢిల్లీ కార్పొరేషన్ ఈ ఏడాది గుర్తించింది.  ఇందులో 6 లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రిలో, మూడు ఉత్తర డీఎంసీ పరిధిలోని కేంద్రకార్యాయాల్లో గుర్తించింది. డీడీఏ, ఢిల్లీ సాంకేతిక యూనివర్సిటీ, డీటీసీ, ఇంకా పలు ప్రాంతాలల్లో డెంగీ కారకమైన దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవు. 2010లో ఢిల్లీలో భారీగా 6,200 డెంగీ కేసులు నమోదు అయ్యాయి. 2009లో 1,153, 2008లో 1,300, 2011లో 1,131, 2012లో 2,093 కేసులు నమోదు అయ్యాయి.

 

 ముందస్తు చర్యలు

 వర్షాలు రావడానికి ముందు స్థానిక సంస్థలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొన్నాయి. ఈ కారణంగా ఈ ఏడాది ఈ అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయి. ఫాగింగ్ నిర్వహించడం, దోమల వృద్ధి కేంద్రాలను గుర్తించి, నివారించడం ద్వారా డెంగీని అదుపులోకి తేవడానికి కృషి చేస్తున్నాయి. దోమల వృద్ధికి కారకులైన 1,53,919 మంది ఇళ్ల యజమానులను అధికారులు గుర్తించారు. 1,07,972 మందికి న్యాయపరమై నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో 12,477పై విచారణ కూడా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top