రెళ్ల నిర్వహణలో ప్రైవేట్‌కు అవకాశం


రైళ్లను నడిపేందుకు ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతి ఇవ్వాలంటూ రైల్వే పునర్నిర్మాణంపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు చేసింది. ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లను నడిపించటంతో పాటు, కోచ్‌లు, వ్యాగన్‌లు, లోకోమోటివ్ ఇంజన్‌ల ఉత్పత్తిని ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించవచ్చని బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచించింది.



రైల్వేల పునర్నిర్మాణంపై తన మధ్యంతర నివేదికను మంగళవారం ప్రభుత్వానికి సమర్పించింది. అంతే కాకుండా రైల్వేలు ఇప్పటి వరకు నిర్వహిస్తున్న పాఠశాలలు, ఆసుపత్రులు, రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ వంటి సంక్షేమ కార్యక్రమాలను ఉపసంహరించుకోవాలనీ సిఫారసు చేసింది. రైల్వే పాఠశాలలను కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌కు, వైద్య సర్వీసుల కోసం రైల్వే మంత్రిత్వ శాఖలోనే ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న రైల్వే ఉత్పత్తి యూనిట్లనన్నింటికీ భారతీయ రైల్వే ఉత్పత్తి కంపెనీ పేరుతో కొత్త సంస్థ పరిధిలోకి తీసుకురావాలంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top