నోట్ల రద్దు: నిబంధనలు-వెసులుబాటు






ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  రూ.500,1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటన చేశారు. నల్లధనం కట్టడికి కఠిన నిర్ణయాలు తప్పనిసరి అని, క్యాలెండర్‌లో 9వ తేదీ రాగానే పెద్దనోట్లు చెల్లవని, అక్రమార్కులకు అవి చెత్త కాగితాలే అని, చట్టబద్ధమైన మార్పిడి సాధనాలుగా ఉండబోవని తెలిపారు.

పెద్దనోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న  ఈ ఆకస్మిక నిర్ణయంతో ప్రజలు దేశవ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ పలు నిబంధనలతో పాటు సడలింపులు చేసింది. పెద్ద నోట్ల మార్పిడి విషయంలో ఆస్పత్రులు,రైల్వేస్టేషన్లు, పెట్రోల్ బంక్​లు, పాలకేంద్రాలకు మినహాయింపు ఇచ్చింది. రెండు రోజులు మాత్రమే పెద్దనోట్లు చెల్లుతాయని వెల్లడించిన ఆ శాఖ ఆ తర్వాత ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఆ పరిమితిని పెంచింది.
చదవండి: (నోట్ల కష్టాలు... మరో ఆరు నెలలు!)

ఫిబ్రవరి 8

► సగటు వినియోగదారుడికి ఊరట
► మార్చి 13 నుంచి క్యాష్ విత్డ్రాపై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత
► రెండు విడతల్లో నగదు విత్డ్రాయల్స్పై ఆంక్షలు తొలగిస్తాం: ఆర్బీఐ
► ఫిబ్రవరి 20 నుంచి ఏటీఎంల్లో విత్డ్రా పరిమితి వారానికి రూ.50వేలకు పెంపు
► ప్రస్తుతం ఏటీఏం విత్డ్రా పరిమితి వారానికి రూ.24వేలు
జనవరి 16
► ఏటీఎంలలో నగదు విత్డ్రా పరిమితి పెంపు
► ఏటీఎం నుంచి ఇక రోజుకు 10 వేలు విత్డ్రాకు అవకాశం
► అయితే.. వారానికి 24 వేలే!
► కరెంట్‌ అకౌంట్ల పరిమితి కూడా రూ.50వేల నుంచి రూ. లక్షకు పెంపు
► పాత నోట్లు డిపాజిట్‌ చేసుకునేందుకు ఎన్నారైలకు అదనపు సమయం

జనవరి 8

► కో ఆపరేటివ్ బ్యాంకులు సహా ఇతర బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు నుంచి వివరాలు కోరిన ఐటీ
► ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 9 వరకు నగదు డిపాజిట్ వివరాలు సమర్పించాలని ఐటీ ఆదేశాలు
►ఫిబ్రవరి  28,2017 లోపు  నివేదిక సమర్పించాలి.

జనవరి 2
► పెద్ద నోట్ల డిపాజిట్లలో ఎన్ ఆర్ ఐ లకు ఆర్థికశాఖ కొత్త మెలిక పెట్టింది.
► విదేశాలకు వెళ్ళే భారతీయులు అయితే మార్చి 31 వరకు వరకు
►ఎన్ఆర్ ఐ లకు జూన్ 30వరకు ఆర్ బి ఐ శాఖల్లో డబ్బును డిపాజిట్  చేసుకోవచ్చు.
► డిపాజిట్ కంటే ముందు కస్టమ్స్ అధికారుల నుండి ధృవీకరణ పత్రాలను తీసుకురావాలని ఆర్థికశాఖ తేల్చింది.

జనవరి 1
►రద్దుచేసిన నగదు నోట్లను మార్చుకొనేందుకు ఎన్ఆర్ఐ లకు  2017 ,జూన్ 30 వరకు  కేంద్రం అవకాశం ఇచ్చింది.
►ఫెమా చట్ట నిబంధనల కింద ఒక్కొక్కరు రూ.25 వేలకు  పరిమితి
 

డిసెంబర్ 30
►విత్ డ్రా పరిమితి  పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది.
►రోజుకు ప్రస్తుతమున్న రూ. 2500 విత్ డ్రా పరిమితిని 4500కు పెంపు
► ఈ సదుపాయం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.

డిసెంబర్ 29
►కేంద్రం మరో యూటర్న్.  పాతనోట్ల రద్దు  అనంతరం ప్రభుత్వం జారీచేసిన తాజా  ఆర్డినెన్స్‌లో కీలక సవరణ చేసింది.
►రద్దయిన పాతనోట్లనుకలిగి ఉంటే జైలు శిక్ష తప్పదనే నిబంధనపై కేంద్రం వెనక్కి తగ్గింది.
► రూ.1000, రూ.500 నోట్లు కల్గివుంటే రూ.10వేలు కనీస జరిమానా  
►ఈ ఆర్డినెన్స్‌  గురువారం  రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వద్దకు చేరుకోనుంది.  
►అధ్యక్షుని ఆమోదం  అనంతరం ఈ నెల 31నుంచి ఈ ఆర్డినెన్స్‌ అమలులోకి రానుంది.

డిసెంబర్ 28
►పాత నోట్లపై కేంద్రం కొత్త నిర్ణయం: ఆర్డినెన్స్ కు   ఒకే చెప్పిన క్యాబినెట్
►2017 మార్చి 31 తర్వాత పాత నోట్లను కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు శిక్ష  
►డిసెంబర్ 30 తర్వాత పాతనోట్లతో లావాదేవీలు జరిపితే రూ.5వేల వరకు జరిమానా
 

 

డిసెంబర్26

► రద్దయిన నోట్లు 10 వేలకు పైగా కలిగి ఉంటే  భారీ జరిమానా
►త్వరలో ఆర్డినెన్స్ జారీ చేయనున్న కేంద్రం
► రూ.50 వేల జరిమానా, లేదా పట్టుబడిన సొమ్ముకు అయిదురెట్ల జరిమానా
► ప్రత్యేక  సందర్భాల్లో మేజిస్ట్రేట్  ద్వారా జరిమానా నిర్ణయం
► డిసెంబర్ 30 తరువాత రద్దయిన  నోట్లు కేవలం రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లలో మాత్రమే  డిపాజిట్ చేసే సదుపాయం

డిసెంబర్ 25

ఆస్తులు జప్తు చేసుకునేందుకు కేంద్రం అడుగులు
బినామీ అని రుజువైతే ఏడేళ్ల వరకు జైలు..
ఆస్తి విలువలో 25% జరిమానా
తప్పుడు సమాచారమిచ్చినా 10 శాతం ఫైన్‌
ఆదాయానికి మించినా.. లెక్క చెప్పలేని ఆస్తులున్నా ఇదే చట్టం
పాత చట్టాన్ని ఆగస్టులోనే సవరించిన కేంద్రం
జప్తులో జాప్యం నివారణకు మరోసారి సవరణ యోచన
ఈ నెల 30తో ‘నోట్ల రద్దు’కు ముగియనున్న గడువు
ఆ తర్వాత బినామీలపై చర్యలకు కసరత్తు

డిసెంబర్ 21
వేతనాల చెల్లింపు చట్టం-1936లో మార్పులు చేస్తూ  కేంద్ర ప్రభుత్వం కీలక ఆర్డినెన్స్‌ జారీ
నోట్ల రద్దు కష్టాల నేపథ్యంలో ఇక చెక్కులు లేదా బ్యాంకుల ద్వారానే జీతాల చెల్లింపు
చెక్కుల ద్వారా నేరుగా ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో చెల్లింపు
 

పాత నోట్ల డిపాజిట్లపై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్ బీఐ. డిసెంబర్ 30 వరకు రూ.5 వేలకు పైన  డిపాజిట్లు  ఒకసారే అన్న నిబంధనను రిజర్వ్ బ్యాంక్ బుధవారం ఉపసంహరించుకుంది.

డిసెంబర్ 20

నగదు రహిత ఆర్థిక వ్యవస్థ   సాధనకు  ప్రభుత్వం కట్టుబడి ఉంది.  ఆర్బీఐ దగ్గర  ఇపుడు సరిపడా నగదు ఉంది. ఆధార ఆధారిత  లావాదేవీలు దాదాపు 300 శాతం పెరిగాయి
నగదుఆర్థిక వ్యవస్థకోసం చిన్నవ్యాపారులకు   పన్ను ప్రోత్సాహకాలు, డిజిటల్ లావాదేవీలు జరిపిన చిన్న వ్యాపారులకు  6శాతం పన్ను దీని మూలంగా మొత్తం 30 శాతానికి పైగా చిన్న వ్యాపారులను  పన్ను మినహాయింపు.

డిసెంబర్ 19
 రూ.2కోట్లు కంటే ఆదాయం తక్కువగా ఉన్న వ్యాపారులు తమ వినియోగదారులను డిజిటల్‌ లావాదేవీల దిశగా ప్రోత్సహిస్తే వారికి  పన్నులో కొంత మినహాయింపు-  కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)
ఆదాయపన్ను చట్టం 1961లోని సెక్షన్‌ 44ఏడీ ప్రకారం రూ.2కోట్లు, అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న వారు 8శాతం పన్ను చెల్లించాలి.  అయితే  2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిగా డిజిటల్‌ లావాదేవీలు జరిపితే వారికి పన్నులో కొంత రాయితీ ఇచ్చి ఆరు శాతం మాత్రమే వసూలు
 నగదు లావాదేవీలు నిర్వహించిన వారికి  యథావిధిగా 8శాతం పన్ను వర్తింపు.
► పెద్ద నోట్ల కష్టాలు త్వరలోనే తీరుతాయి: జైట్లీ
► డిమాండ్కు సరిపడ నగదు అందుబాటులో ఉంది : జైట్లీ
► నగదు విత్డ్రా పరిమితి ఎత్తివేతపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: జైట్లీ

 
డిసెంబర్ 18

 డిపాజిట్లపై కొత్త నిబంధన: రూ.ఐదువేల కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్‌ చేయాలి.
డిసెంబర్ 18
రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు షరతులతో కూడిన పన్ను మినహాయింపు. డిసెంబర్ 31 వరకు రద్దయిన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్  చేసుకోవచ్చు.

డిసెంబర్ 15 
డిజిటల్ చెల్లింపులకు  నీతి ఆయోగ్ భారీ ప్రోత్సాహకాలు:  రెండుకొత్త పథకాలు లక్కీ గ్రాహక్ యోజన , డిజిధన్ వ్యాపారి యోజన.
లక్కీ  డ్రా ద్వారా ఎంపిక చేసిన వినియోగదారులకు, వ్యాపారస్తులకు బంపర్ బహుమతులు.

డిసెంబర్ 9
డిజిటల్‌ ట్రాన్సాక్షన్‌ ఛార్జీలు లేదా ఎండీఆర్‌లకు సంబంధించి ఒక్కో లావాదేవీకి రూ.2,000 వరకు డిజిటల్‌ చెల్లింపులపై సర్వీస్‌ టాక్స్‌ రద్దు
డిజిటల్‌ రూపంలో (డెబిట్‌ / క్రెడిట్‌ కార్డు, ఇ-వాలెట్స్‌, మొబైల్‌ వాలెట్స్‌ తదితరాలు) పెట్రోలు, డీజిల్‌ కొనుగోలు పై కొనుగోలుదారులకు విక్రయ ధరపై 0.75 శాతం తగ్గింపు
పదివేల కన్నా తక్కువ జనాభా ఉండే ఒక లక్ష గ్రామాల్లో ప్రతీ గ్రామానికి రెండు పీఓఎస్‌ల ఏర్పాటు. రూపే కిసాన్‌ కార్డులు  పీఓఎస్‌ మెషిన్లు / మైక్రో ఏటీఎం / ఏటీఎంలద్వారా వద్ద నగదు రహిత లావాదేవీలు. దేశవ్యాప్తంగా 4.32 కోట్ల మంది కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ కలిగిన వారికి లబ్ది
సబర్బన్‌ రైల్వే నెట్‌వర్క్‌ ద్వారా ప్రోత్సాహకాలు. జనవరి 1 నుంచి నెలవారీ, సీజనల్‌ టికెట్లను కొనే వారు డిజిటల్‌ రూపంలో చెల్లిస్తే వారు 0.5 శాతం డిస్కౌంట్‌ పొందుతారు.
అన్‌లైన్‌ లో టికెట్లు కొనే రైలు ప్రయాణికులందరికీ రూ. 10 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా కల్పించనున్నారు. రోజూ సుమారుగా 14 లక్షల మంది రైలు టికెట్లు కొంటున్నారు. ఇందులో 58 శాతం టికెట్లు ఆన్‌లైన్‌లో డిజిటల్‌ చెల్లింపులతో విక్రయమవుతున్నాయి. మరో 20 శాతం మంది డిజిటల్‌ చెల్లింపులోకి మారగలరని అంచనా. దీంతో రోజుకు సగటున 11 లక్షల మంది ఈ బీమా పరిధిలోకి వస్తారు.
రైల్వే అందించే కేటరింగ్‌, వసతి, విశ్రాంతి గదులు లాంటి పెయిడ్‌ సేవలకు డిజిటల్‌ రూపంలో చెల్లింపులపై 5 శాతం డిస్కౌంట్‌ ప్రకటించారు.
ప్రభుత్వరంగ బీమా సంస్థలు సాధారణ బీమా పాలసీలకు డిజిటల్‌ చెల్లింపులపై 10 శాతం రాయితీని అందించనున్నాయి. అదే విధంగా ఎల్‌ఐసీ నూతన జీవిత బీమా పాలసీలపై 8 శాతం రాయితీని అందించనుంది. వీటిని పొందేందుకు సంబంధిత పోర్టల్స్‌ ద్వారా చెల్లింపులు చేయాలి.
కేంద్ర ప్రభుత్వ విభాగాలకు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెల్లింపులు డిజిటల్‌ రూపంలో చేస్తే లావాదేవీల ఫీజు / ఎండీఆర్‌ ఛార్జీల భారాన్ని వినియోగ దారులపై మోపరు. ఆ భారాన్ని ఆయా సంస్థలే భరిస్తాయి. ఇదే విధానాన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.
పీఒఎస్‌ టర్మినల్స్‌, మైక్రో ఏటీఎం, మొబైల్‌ పీఓఎస్‌లకు నెలవారీ అద్దెను రూ100 లోపుగా తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం సూచించింది. దీంతో చిన్న తరహా వ్యాపారులు మరెందరో వీటిని పొందేందుకు వీలు కలుగుతుంది.
జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాల వద్ద ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డ్‌ లేదా ఫాస్ట్‌ టాగ్స్‌ ఉపయోగించి చెల్లింపు చేస్తే 2016-17 వరకు 10 శాతం తగ్గింపు.
 

డిసెంబర్ 8
‘నోట్ల’ ఇబ్బందులను తట్టుకునేందుకు నగదు రహిత లావా దేవీలను ప్రోత్సహిస్తూ పలు ఉపశమన చర్యల ప్రకటన

డిసెంబర్ 7
బ్యాంకుల్లోకి రూ.11.55 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్లు ప్రకటించిన రిజర్వు బ్యాంకు.

డిసెంబర్ 6
నోట్ల రద్దు’ తర్వాత రూ.2 వేల కోట్ల లెక్కల్లో చూపని ధనాన్ని వెల్లడించినట్లు ఆదాయ పన్ను శాఖ ప్రకటన. తమ దాడుల్లో రూ. 130 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు గుర్తించినట్లు వెల్లడి.
 
డిసెంబర్ 1న ఆర్బీఐ విధించిన పరిమితి...
  • పెట్రోల్‌ బంకుల్లో, విమాన టికెట్లు కొనుగోళ్లలో ఈ నెల 2వ తేదీ వరకు మాత్రమే పాత 500 రూపాయల నోటు చెల్లుబాటు

 

డిసెంబర్ 1న బంగారంపై విధించిన పరిమితులు: 

వెల్లడించిన డబ్బుతో బంగారం కొంటే ఎలాంటి సమస్య ఉండదు
► పన్ను మినహాయింపు ఉన్న డబ్బుతో కొన్నా ఇబ్బంది లేదు
► ఇంట్లో దాచుకున్న డబ్బుతో బంగారం కొంటే ప్రాబ్లం లేదు
► ఇలా కొన్న బంగారం, నగలపై ఎలాంటి పన్ను ఉండదు
► వారసత్వంగా వచ్చిన బంగారంపైనా పన్ను ఉండదు
► వివాహమైన మహిళ వద్ద అరకేజీ బంగారం ఉంటే సీజ్ చేయం
► పెళ్లికాని మహిళ వద్ద 250 గ్రాములు ఉంటే ఎలాంటి సీజ్ ఉండదు
► పురుషుల వద్ద 100 గ్రామలు వరకు బంగారం ఉండొచ్చు
 
నవంబర్ 30 మార్పులు...
► ప్రధానమంత్రి జన్-ధన్ యోజన ఖాతాల నుంచి విత్డ్రా చేసే నగదుపై పరిమితి
► విత్డ్రా లిమిట్ను  పదివేలకు కుదిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడి
► కేవైసి ఖాతాదారులకు నెలలో రూ.10,000, నాన్ కేవైసి ఖాతాదారులకు నెలలో రూ.5000 విత్డ్రాకు  అనుమతి
► 10వేలకు పైన విత్డ్రాకు  సరియైన ఆధారాలు, పత్రాలు చూపించిన తరువాత  బ్యాంక్ మేనేజర్ అనుమతితో విత్డ్రా
► బినామీ ఆస్తి లావాదేవీ, డబ్బు లావాదేవీల నుంచి  అమాయక రైతులు, గ్రామీణ ఖాతాదారుల రక్షించడానికి వీలుగా ఈ ప్రకటన
 
నవంబర్ 28వ తేదీ  నిబంధనలు...
► డిపాజిట్లలో లెక్కతేలని సొమ్ముపై సర్కారు కన్ను
► స్వచ్ఛందంగా వెల్లడిస్తే పన్ను 50 శాతమే
► మిగిలిన 50 శాతంలో 25 శాతం వెనక్కి తీసుకోవచ్చు
► మరో 25 శాతంపై నాలుగేళ్ల లాకిన్‌.. వడ్డీ ఉండదు
► దాన్ని పేదరిక నిర్మూలనకు ఉపయోగిస్తామన్న ప్రభుత్వం
► దీనికోసం ప్రధానమంత్రి గరీబీ కల్యాణ్‌ యోజన పేరుతో కొత్త పథకం
► స్వచ్ఛంద వెల్లడికి గడువు డిసెంబర్‌ 30
► వెల్లడించకుండా అధికారుల సోదాల్లో దొరికితే 85% పన్ను
► ఆదాయ పన్ను చట్టంలో సవరణలకు పార్లమెంటులో బిల్లు
► ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ
 
నవంబర్ 25వ తేదీ  సడలింపులు...
► పాత రూ.500, రూ.1000 నోట్లను ఆర్బీఐ కౌంటర్లలో మార్చుకోవచ్చు.. ఒకవ్యక్తి పాత నోట్లను మార్చుకునేందుకు పరిమితి      రూ.2వేలు.
► ముద్రణ సమస్యల వల్ల కొన్ని కొత్త రూ.500 నోట్లలో తప్పులు దొర్లాయని, అయినా సరే ఆ నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ  ప్రకటించింది.
► ఐనాక్స్ థియేటర్ల వద్ద డెబిట్ కార్డులతో రూ.2వేలు తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం 17 చోట్ల ఈ సౌకర్యం అందుబాటులోకి  వచ్చింది.
► వ్యక్తుల వద్ద ఉండే బంగారంపై పరిమితి పెట్టాలన్న ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. 

నవంబర్ 24 మార్పులు(గురువారం)
► బ్యాంకుల్లో రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి రద్దు

► పోస్టాఫీసుల్లోనూ నోట్ల మార్పిడికి అవకాశం ఉండదు

► బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్‌కే రూ. 1,000 నోటు పరిమితం

► 15వ తేదీ వరకు అనుమతించిన చెల్లింపులన్నీ పాత రూ. 500 నోట్లతోనే..

► జాబితాలో తాజాగా మొబైల్ రీచార్జ్, స్కూలు ఫీజులు, కో-ఆపరేటివ్ స్టోర్లు  

► పౌరసేవల బిల్లుల్లో కరెంటు, నీటి బకాయిలకు మాత్రమే అవకాశం

► డిసెంబర్ 2 వరకూ టోల్ ట్యాక్స్ రద్దు..

ఎక్కడెక్కడ పాత 500 నోటు చెల్లుతుందంటే..

పౌర సేవల బిల్లులు.. కేవలం విద్యుత్, నీటి బిల్లుల కోసమే.. బకాయిలు చెల్లించాలి.. ఆస్తి పన్ను చెల్లింపులకు వర్తించదు

టోల్ ప్లాజాలు (డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకూ టోల్ వసూలు లేదు)    డిసెంబర్ 3 నుంచి 15 వరకు చెల్లించవచ్చు

పెట్రోల్ బంకులు.. శ్మశాన వాటికలు.. కోర్టు ఫీజులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని పాల కేంద్రాలు

 ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య ఖర్చులకు

డాక్టర్ చీటీతో అన్ని మందుల షాపుల్లో మందుల కొనుగోలుకు

రైల్వే టికెట్ కౌంటర్లు, బస్సు టికెట్ కౌంటర్లు (ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సహకారంతో నడిచే బస్సులు), ఎరుుర్‌పోర్టు కౌంటర్లు

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొనుగోలుకు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపాలిటీ, స్థానిక సంస్థల స్కూళ్లలో ఒక్కో విద్యార్థి రూ.2 వేల వరకూ ఫీజులు చెల్లించవచ్చు.

 రాష్ట్ర ప్రభుత్వ విక్రయ కేంద్రాల నుంచి విత్తనాల కొనుగోలుకు

మొబైల్ రీచార్జ్ కోసం.. ఒక రీచార్జ్‌కు ఒక్క నోటే తీసుకుంటారు.

కన్సూమర్ కోఆపరేటివ్ స్టోర్ల నుంచి రూ. 5 వేల వరకూ కొనుగోళ్లకు

విదేశీయులు వారానికి రూ. 5 వేల వరకూ విదేశీ కరెన్సీ మార్చుకోవచ్చు. వివరాలు పాస్‌పోర్టులో తప్పకుండా నమోదు చేయాలి.

రైల్వే క్యాటరింగ్ సేవలకు, సబర్బన్, మెట్రో రైలు టికెట్ల కొనుగోలుకు

చారిత్రక స్థలాల్లో టికెట్ల కొనుగోలుకు


 

నవంబర్ 23 మార్పులు(బుధవారం)
► లక్షా  55 వేల పోస్ట్ ఆఫీసుల్లో కొత్త కరెన్సీ నోట్లు అందుబాటు
►సహకార బ్యాంకుల్లో నగదునిల్వపై ఆర్బీఐకి ఆదేశాలు
►నాబార్డుకు, సహకార బ్యాంకులకు 21 వేల కోట్లు పంపిణీ
►అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం

నవంబర్ 21న (సోమవారం) రైతులకు ఊరట
► కరెంట్‌, ఓవర్‌ డ్రాఫ్ట్‌, క్యాష్‌ క్రెడిట్‌ ఖాతాదారులు వారంలో రూ. 50 వేల వరకు విత్‌ డ్రా చేసుకోవచ్చు: ఆర్బీఐ
► వ్యక్తిగత ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాలు కలిగిన వారికి ఇది వర్తించదని స్పష్టం చేసిన ఆర్బీఐ
► పాత పెద్ద నోట్లతో రైతులు ప్రభుత్వ దుకాణాల్లో రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఆర్బీఐ అనుమతి
► రైతులు, రక్షణ, పారా మిలటరీ, గ్రూపు సీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు ఉపసంహరణ నియంత్రణల సడలింపు
►నవంబర్‌ 10 నుంచి 18 వరకు బ్యాంకు ఖాతాల నుంచి ప్రజలు 1.03 లక్షల కోట్లు విత్‌ డ్రా చేశారని ఆర్బీఐ తెలిపింది.

నవంబర్ 18న (శుక్రవారం) క్రమంగా నగదు మార్పిడి ఎత్తివేత
► ఏ బ్యాంకులో ఖాతా ఉంటే అక్కడే (శనివారం 19) పాత నోట్లను  మార్చుకోవాలి. అయితే సీనియర్‌ సిటిజన్స్‌​ కు మినహాయింపు
► ఆదివారం బ్యాంకులు పని చేయవు
► బ్యాంకు లాకర్లు సీజ్‌ చేసి బంగారం, వజ్రాలు, ఆభరణాలు స్వాధీనం చేసుకుంటారన్న వార్తలన్నీవదంతులే
అని ఆర్థిక శాఖ వెల్లడి
► నగదు మార్పిడిని రూ.2వేలకు తగ్గించిన కేంద్రం క్రమంగా దాన్ని ఉపసంహరించాలని యోచన
► దానికి బదులుగా నగదును ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవాలంటూ ప్రజల్ని కోరనున్న కేంద్ర ప్రభుత్వం
► నల్లధనం దాచుకునేందుకు బ్యాంకు ఖాతాల్ని దుర్వినియోగం చేసేవారిపై చర్యలు తప్పవని కేంద్రం హెచ‍్చరిక
►  ప్రస్తుత నిబంధన ప్రకారం జన్‌ధన్‌ ఖాతాదారులు రూ.50 వేలు, సాధారణ ఖాతాల్లో రూ.2.50 లక్షల వరకూ జమ చేసుకోవచ్చు.
► ఒకవేళ ఖాతాను దుర్వినియోగం చేస్తే...విచారణలో అది రుజువైతే ఆ నగదుపై ఆదాయపు పన్నుతో పాటు పెనాల్టీ విధింపు

నవంబర్ 17న (గురువారం) నగదు మార్పిడిపై పరిమితి
 ►  వివాహ వేడుకలకు రూ.2.5 లక్షల నగదును విత్ డ్రా చేసుకోవచ్చు
 ►  పంట రుణం కింద మంజూరైన, రైతుల అకౌంట్లకు క్రెడిట్ అయిన రుణం నుంచి వారానికి రూ.25,000ను రైతులు విత్డ్రా చేసుకోవచ్చు
 ►  కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు ఇదే పరిమితి వర్తింపు
 ►  రైతులంతా  కేవైసీ వివరాలు అందించాలి
 ►  ఆ అకౌంట్లు రైతు పేరు మీదనే ఉండాలి, రుణ పరిమితులకు లోబడి ఉండాలి.
 ►  రుణ బీమా ప్రీమియం తేదీల గడువు 15 రోజులకు పెంపు
 ►  నగదు మార్పిడి కింద ఒక్కవ్యక్తి రేపటి(నవంబర్ 18) నుంచి డ్రా చేసుకునే మొత్తం రూ.4500 నుంచి రూ.2000లకు కుదింపు
 ►  ఏపీఎంసీ(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ)లో రిజిస్టర్ అయిన వారు వారానికి రూ.50వేలు విత్డ్రా చేసుకోవచ్చు
 ►   ఏటీఎంలో సాప్ట్ వేర్ మార్పుపై టాస్క్ఫోర్స్
 ►  కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు(అప్ టూ గ్రూప్ సీ... ఉద్యోగులు)  అడ్వాన్స్ జీతం కింద రూ.10,000 నగదును ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం
 ►   ప్రభుత్వం వద్ద అవసరమైనంత నగదు లభ్యత ఉంది, నగదు ఇబ్బంది లేదు

నవంబర్ 15న (మంగళవారం) నిర్ణయాలు
► కరెన్సీ మార్పిడికి వచ్చే వారికి వేలిపై ఇంకు గుర్తు పెట్టాలని కేంద్రం నిర్ణయం
► జన్‌ధన్ యోజన ఖాతాల్లో డిపాజిట్ పరిధి రూ.50 మించకూడదని ఆదేశాలు జారీ
► ఈ వారాంతానికల్లా ఏటీఎంల నుంచి విత్ డ్రా పరిమితి రోజుకు రూ.4వేలకు పెంచాలన్న ప్రతిపాదన ఉపసంహరించుకున్న కేంద్రం
► సహకార బ్యాంకుల్లో పాత పెద్ద నోట్ల మార్పిడిని నిలిపివేస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ. ఇప్పటికే ఖాతాల్లో ఉన్న సొమ్ము విత్ డ్రాకు మాత్రమే అవకాశం

నవంబర్ 14న (సోమవారం) నిర్ణయాలు
► ప్రభుత్వ ఆస్పత్రులు, పెట్రోలు బంకులతో పాటు రైల్వే, విమాన టికెట్ల కొనుగోలుకు, ప్రజా రవాణా కోసం, పాల కేంద్రాలు, శ్మశాన వాటికల్లో పా నోట్ల వాడకం గడువు ఈనెల 24 వరకు పొడిగింపు
► టోల్ చార్జీల వసూలు రద్దు నవంబర్ 18 అర్ధరాత్రి వరకూ పొడిగింపు
► ఏటీఎం లావాదేవీల చార్జీలు ఎత్తివేసిన బ్యాంకులు
► 'కరెంట్ ఖాతా'ల విత్ డ్రా పరిమితి వారానికి రూ.50వేలకు పెంపు. అయితే ఖాతా తెరచి మూడు నెలలు కావాలి.
► సహకార కేంద్రాలతో పాటు, కోర్టు ఫీజులు చెల్లించేందుకు పాత నోట్లు వాడకానికి ఓకే.
► నవంబర్‌ 21 వరకూ ఎయిర్‌పోర్టుల్లో పార్కింగ్‌ ఫీజు రద్దు చేస్తూ ఎయిర్‌పోర్ట్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్ణయం
► దేశ వ్యాప్తంగా కొత్త నోట్ల విత్‌ డ్రా కోసం వందల కొద్దీ మైక్రో నగదు ఏటీఎంల్ని ఏర్పాటు చేస్తాం: ఆర్థికశాఖ
► గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే బ్యాంకింగ్‌ కరస్పాండెట్లు వద్ద నగదు నిల్వను రూ. 50 వేలకు కేంద్రం పెంచింది. రోజుకు ఎన్నిసార్లైన బ్యాంకుల నుంచి వారు నగదు పొందేందుకు అవకాశం కల్పించింది.
► కరెన్సీ మార్పిడి కోసం వయోవృద్ధులకు, దివ్యాంగులు ప్రత్యేక క్యూ ద్వారా నగదు మార్పిడి.   
► పెన్షనర్లు ఏటా ప్రభుత్వానికి ఇచ్చే లైఫ్ సర్టిఫికేట్ గడువును వచ్చే ఏడాది జనవరి 15కు పెంచిన కేంద్రం

నవంబర్ 13 ఆదివారం: విత్ డ్రా పరిమితి పెంపు
► బ్యాంకుల్లో నగదు విత్ డ్రా పరిమితి వారానికి రూ.20 వేల నుంచి రూ.24వేలకు పెంపు. ఖాతాదారుడు ఒకేరోజైనా లేదా వారంలో ఎప్పుడైనా స‌రే తీసుకోవ‌చ్చు.
► నోట్ల మార్పిడిప పరమితి రూ.4000 నుంచి రూ.4500కు పెంపు
► రోజుకు రూ.10,000 విత్ డ్రా నిబంధన ఎత్తివేత
► ఏటీఎంల ద్వారా విత్ డ్రా పరిమితిని రోజుకు రూ.2000 నుంచి రూ.2500కు పెంపు

నవంబర్ 10న (గురువారం) నిర్ణయాలు
► ఖాతాల్లోంచి డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన వాళ్లకు  రూ.10 వేల వరకు అవకాశం
► పాత నోట్లతో 11వ తేదీ రాత్రివరకూ విద్యుత్ బిల్లు చెల్లింపులు చేయవచ్చు: టీఎస్ఎస్పీడీసీఎల్
► 860 పోస్టాపీసుల్లో కరెన్సీ మార్పిడికి 24వరకు అవకాశం: తెలంగాణ పోస్టల్ శాఖ
► పాత నోట్లతో ఆస్తిపన్ను, నల్లా, కరెంట్ బిల్లులు చెల్లింపులు: కేంద్రం
► కొత్త వెయ్యి రూపాయల నోట్లు తీసుకొచ్చేందుకు కేంద్రం నిర్ణయం
► టికెట్ల రద్దు చేసుకున్న వారికి నగదు తిరిగి చెల్లించవద్దు: రైల్వేశాఖ

నవంబర్ 9న (బుధవారం) నిర్ణయాలు:  రూ.2.5 లక్షలు దాటితే కొరడా
► రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై పన్ను. గృహిణులు రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేసినా ఎలాంటి పన్ను ఉండదు. అయితే రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తేనే సమస్య
► రిటర్నుల్లో సమర్పించిన ఆదాయ వివరాలతో సరిపోలకపోతే 200 శాతం జరిమానా
► ఈ నెల 11వ తేదీ వరకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ చమురు సంస్థల పరిధిలోని పెట్రోల్ బంకులు, గ్యాస్ కేంద్రాలు, మెడిసిన్ షాపులు, పాల కేంద్రాలు, సహకార స్టోర్లు, శ్మశాన వాటికల్లో పాత రూ.1,000, రూ.500 నోట్లు చెల్లుబాటు. రైల్వేకౌంటర్లు, బస్టాండుల్లో, విమానాశ్రయాల్లో టికెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు
 
నవంబర్ 8న (మంగళవారం)  నిర్ణయాలు
►ఆర్బీఐ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.500, రూ.1,000 నోట్లను నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు ఎలాంటి పరిమితి లేకుండా అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ అకౌంట్లోకి సరైన ఆధారాలు చూపించి బదిలీ చేయవచ్చు. అయితే బ్యాంకుల్లోని కేవైసీ (నో యువర్ కస్టమర్) ఫారాలను అసంపూర్తిగా నింపిన వారు కేవలం గరిష్టంగా రూ.50 వేల వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చు
► కొద్ది రోజుల వరకు బ్యాంకుల నుంచి విత్ డ్రాయల్ పరిమితి రోజుకు రూ.10 వేలు, వారానికి రూ.20 వేలుగా నిర్ణయించారు. నవంబర్ 24న సమీక్ష తర్వాత ఈ పరిమితిని పెంచనున్నారు
► ఏటీఎంల్లో విత్ డ్రాయల్ (నవంబర్ 18 వరకు) కార్డుపై రోజుకు రూ.2 వేలు మాత్రమే. తర్వాత దీన్ని రూ.4 వేలకు పెంచనున్నారు
► నవంబర్ 24 వరకు ఐడీ ప్రూఫ్ చూపించి హెడ్ పోస్టాఫీసులు, బ్యాంకుల్లో రోజుకు 500, 1000 నోట్లను రూ.4 వేల వరకు మార్చుకో వచ్చు. ఈ పరిమితిపై 15 రోజుల తర్వాత సమీక్షిస్తారు
► చెక్, డీడీ, క్రెడిట్ కార్డులు, ఎలక్ట్రానిక్ ట్రాన్‌‌సఫర్ ద్వారా జరిగే లావాదేవీలపై ఆంక్షలు లేవు
► డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో రూ.500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేయలేని వారు మార్చి 31, 2017 వరకు ఆర్బీఐ కేంద్రాల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించి బదిలీ చేసుకోవచ్చు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top