హెడ్‌ కానిస్టేబుల్‌ సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు

హెడ్‌ కానిస్టేబుల్‌ సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు


బెంగళూరు: అతడు ఓ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌. అది కూడా క్రైం బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కానీ, పైకి మాత్రం పోలీసుగా ఉంటూ ఎవరికీ తెలియకుండా నేరప్రవృత్తిని చేస్తూ చివరికి బయటపడ్డాడు. గుట్టుచప్పుడు కాకుండా హైటెక్‌ వ్యభిచారం నడిపిస్తూ ఆఖరికి పట్టుబడ్డాడు. ఈ వ్యవహారం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు అతడు డిజిటల్‌ లావాదేవీలు కొనసాగిస్తుండటం గమనార్హం. వివరాల్లోకి వెళితే..



బెంగళూరులోని పరప్పణ అగ్రహార పోలీస్‌ స్టేషన్‌లో కరిబసప్ప అనే ఓ వ్యక్తి క్రైం బ్రాంచ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతడు గత కొంత కాలంగా హైటెక్‌ వ్యభిచారం చేయిస్తున్నాడు. గతవారమే ఈ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు. ఓ ఇంటి నుంచి ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకోవడంతోపాటు స్వైపింగ్‌ మిషన్లు, పెద్ద మొత్తంలో డబ్బు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని హెడ్‌ కానిస్టబుల్‌ అంటున్నాడు. ప్రస్తుతం అతడిని జ్యూడిషియల్‌ కస్టడీకి పంపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top