రేప్‌ కేసులో కేరళ ఎమ్మెల్యే అరెస్ట్‌

రేప్‌ కేసులో కేరళ ఎమ్మెల్యే అరెస్ట్‌ - Sakshi


తిరువనంతపురం: 51 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణల కింద కేరళకు చెందిన కాంగ్రెస్‌ శాసనసభ్యుడు ఎం.విన్సెంట్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అంతకుముందే అతనిపై మహిళను ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలపై కేసు నమోదైంది. జూలై 19న బాధిత మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.



తిరువనంతపురంలోని కోవళం స్థానం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విన్సెంట్‌ తన భార్య వెంటపడి, ఫోన్‌ చేసి వేధిస్తున్నాడని బాధితురాలి భర్త అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళకు ఎమ్మెల్యే గత కొన్ని నెలల్లో 900 సార్లు ఫోన్‌ చేశాడని పోలీసులు తెలిపారు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top