సివిల్స్‌లో తెలుగు తేజాలు

సివిల్స్‌లో తెలుగు తేజాలు - Sakshi


టాప్-100లో 10 మందికి ర్యాంకులు

* మొత్తంగా 100 వరకు ర్యాంకులు

* సాధించిన తెలంగాణ, ఏపీ విద్యార్థులు


సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: అఖిల భారత సివిల్ సర్వీసెస్ ర్యాంకుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శనివారం ఢిల్లీలో విడుదల చేసిన సివిల్ సర్వీసెస్-2014 తుది ఫలితాల్లో దాదాపు వంద మంది వరకు ర్యాంకులు సాధించా రు.



హైదరాబాద్‌లో చదువుకున్న వారితోపాటు ఢిల్లీలో చదువుకున్న తెలుగు విద్యార్థులు ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం తొలి వంద ర్యాంకుల్లో 10 మంది తెలుగువారు స్థానం సంపాదించారు. వీరిలో రాష్ట్రానికి చెందిన సాకేతరాజ ముసినిపల్లి జాతీయ స్థాయిలో 14వ ర్యాంకుతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన రిటైర్డ్ ప్రభు త్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛాయారతన్, మాజీ ఐపీఎస్ అధికారి, ఇన్‌ఫర్మేషన్ కమిషనర్ ఎం.రతన్ దంపతుల కుమారుడు. వరంగల్ జిల్లాకు చెందిన ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.



మూడు విడతలుగా జరిగిన ఈ పరీక్షల తుది ఫలితాల్లో మొత్తం 1,236 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఇందులో 590 మంది జనరల్ కేటగిరీకి చెందినవారుకాగా, 354 మంది ఓబీసీ, 194 మంది ఎస్సీ, 98 మంది ఎస్టీ కేటగిరీలకు చెందిన వారున్నారు. వీరితోపాటు మరో 254 మందితో రిజర్వు జాబి తాను కూడా యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో జనరల్‌లో 127 మందిని, ఓబీసీలో 105 మందిని, ఎస్సీల్లో 19 మం దిని, ఎస్టీల్లో ముగ్గురితో ఈ జాబితాను రూపొందించింది. ప్రస్తుతం 73 మంది వరకు సివిల్స్‌కు ఎంపికైన వారి వివరాలు అందాయని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికైన వారు దాదాపు వంద మంది వరకు ఉంటారని ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ డెరైక్టర్ ఆర్.సి. రెడ్డి, ప్రతినిధి వేగిరెడ్డి హరిచక్రవర్తి, అనలాగ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ డెరైక్టర్ విన్నకోట శ్రీకాంత్ వెల్లడించారు.



టాప్ 200 ర్యాం కులు సాధించిన వారిలో సాకేత రాజ ముసినిపల్లి (14వ  ర్యాంకు), సీఎం సాయికాంత్ వర్మ (18), లక్ష్మీకాంత్‌రెడ్డి (21), మహ్మద్ రోషన్ (44), రాజగోపాల సుంకర    (49వ ర్యాంకు), క్రాంతికుమార్ పాటి    (50వ ర్యాంకు), వి.ఆర్.కె.తేజ మైలవరపు (66వ ర్యాంకు), రెడ్డి వేదిత (71వ ర్యాంకు), లక్ష్మీభవ్య తన్నీ రు (88వ ర్యాంకు), సతీష్ రెడ్డి పింగిళి (97వ ర్యాంకు), రక్షిత కె  మూర్తి (117వ ర్యాంకు), భరత్‌రెడ్డి బొమ్మారెడ్డి (120వ ర్యాంకు), రాకేష్ చింతగుంపుల (122వ ర్యాంకు), వై రఘువంశీ (190వ ర్యాంకు) ఉన్నారు. అలాగే 200 ర్యాంకుపైన సాధించిన వారు 59 మందికిపైగా ఉన్నారు.

 

సివిల్స్ ర్యాంకర్లకు వైఎస్ జగన్ అభినందనలు

సివిల్ సర్వీసు 2014 తుది ఫలితాల్లో ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తమ శ్రమతో అత్యత్తమ ఫలితాలు సాధించిన వారందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఓ ప్రకటనలో ఆకాంక్షించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top