Alexa
YSR
'ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలి. అందుకు సంక్షేమ పథకాలు పెద్దన్న పాత్ర పోషించాలి'
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జాతీయంకథ

జీఎస్టీకి కేబినెట్‌ ఆమోదం

Sakshi | Updated: March 21, 2017 03:21 (IST)
జీఎస్టీకి కేబినెట్‌ ఆమోదం

ఈ వారంలోనే పార్లమెంట్‌ ముందుకు..

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను అమలులో భాగంగా కేంద్ర కేబినెట్‌ సోమవారం నాలుగు అనుబంధ చట్టాలకు ఆమోదముద్ర వేసింది. ఈ వారంలోనే ద్రవ్య బిల్లులుగా వీటిని లోక్‌సభలో ప్రవేశపెడతారని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేయాలని ఇప్పటికే జీఎస్టీ మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. జీఎస్టీ చట్టాల ఆమోదమే ఏకైక ఎజెండాగా సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది.

కేంద్ర వస్తు సేవల పన్ను బిల్లు 2017 (సీజీఎస్టీ), సమీకృత వస్తు, సేవల పన్ను బిల్లు 2017(ఐజీఎస్టీ), కేంద్రపాలిత ప్రాంత వస్తు సేవల పన్ను బిల్లు 2017(యూటీజీఎస్టీ), వస్తుసేవల పన్ను(రాష్ట్రాలకు పరిహారం) బిల్లు 2017ను కేబినెట్‌ ఆమోదించినట్లు అధికారిక ప్రకటనలో కేంద్రం వెల్లడించింది. ఈ నెలలో జరిగిన సమావేశాల్లోనే నాలుగు చట్టాలను జీఎస్టీ మండలి ఆమోదించింది. దేశంలోని అతిపెద్ద సంస్కరణల్లో ఒకటైన జీఎస్టీని వీలైనంత వేగంగా అమలు చేసేం దుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, భారతీయ ఉత్పత్తులు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడేందుకు  జీఎస్టీ సాయపడుతుందని కేంద్రం తెలిపింది. ఉత్పత్తి సామర్థ్యం పెంపుతోపాటు అనేక మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయని, జీఎస్టీ అమలుతో దేశ జీడీపీలో 1 నుంచి 2 శాతం వరకూ పెరుగుదల కనిపించవచ్చని పేర్కొంది. మరోవైపు రాష్ట్రాల వస్తు, సేవల పన్ను బిల్లు(ఎస్జీఎస్టీ)ను రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంది. 

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అవినీతి బయటపెడితే చాలెంజ్‍లా?

Sakshi Post

Suicide Bomber Killed Near Dhaka Airport

The bomber was not carrying anything in his hands, but looked like a drug addict. 

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC