ఆ మూడు సీట్లలో మారిన రాజకీయ చిత్రం


సాక్షి, న్యూఢిల్లీ: నవంబర్ 25న ఉపఎన్నికలు జరగనున్న తుగ్లకాబాద్, మెహ్రోలీ, కృష్ణానగర్ నియోజకవర్గాలలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ నియోజ కవర్గాల నుంచి బీజేపీ నేతలు రమేష్ బిధూడీ, ప్రవేశ్ వర్మ, హర్షవర్థన్‌లు గెలుపొందడం, తిరిగి వారు ఎంపీలుగా ఎన్ని కై తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నిక ల నాటితో పోలిస్తే ఈ మూడు నియోజకవర్గాలలో పరిస్థితులు మారిపోయాయి. తుగ్లకాబాద్ నియోజకవర్గాన్నే తీసుకుంటే గత అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ బీజేపీ విజయకేతనం ఎగురవేసింది.  బీఎస్పీకి చెందిన సాహీరామ్ పెహల్వాన్ రెండవ స్థానంలో నిలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ మూడు, నాలుగ స్థానాల తో సరిపెట్టుకున్నాయి. కానీ ఇప్పుడు సా హీరామ్ పెహల్వాన్ ఆప్‌లో చేరారు.

 

 దీంతో ఈసారి ఆప్ ఆయనను తమ అభ్యర్థిగా నిలబెట్టవచ్చని భావిస్తున్నారు. ఇక బీజేపీ రమేష్ బిధూడీ సోదరుని తనయుడు పర్వేష్‌ను బరిలోకి దింపవచ్చని అంటున్నారు. మెహ్రోలీ నియోజకవర్గంలోనూ మార్పులు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీలో చేరి ప్రవేశ్ వర్మ గెలుపుకు తోడ్పడిన మాజీ మేయర్ సత్బీర్ సింగ్, తన కౌన్సిలర్ సతీమణితో కలిసి తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఎన్నికల బరిలోకి దిగే అవకాశముందని అంటున్నారు. ఆప్, కాంగ్రెస్ గత ఎన్నికలలో నిలబెట్టిన అభ్యర్థులనే అంటే  నరేం దర్ సేజ్వాల్, డాక్టర్ యోగానందశాస్త్రికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

 ఒకవేళ తనకు టికెట్ ఇవ్వలేనట్లయితే తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని యోగానందశాస్త్రి కోరుతున్నట్లు సమాచారం కృష్ణానగర్ నియోజకవర్గంలో హ ర్షవర్ధన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున పోటీచేసిన వినోద్ కుమార్ మోంగా ఇప్పుడు బీజేపీలో చేరుతారని అంటున్నారు. అలాగే ఆప్ అభ్యర్థిగా పోటీచేసిన ఇషత్ ్రఅలీ అన్సారీ ఆప్‌కు రాజీనామా చేశారు. దానితో ఆప్ కొత్త అభ్యర్థిని బరిలోకి దింపవచ్చని, బీజేపీ మోంగాకు టికెట్ ఇవ్వవచ్చని అంటున్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top