పీసీ సర్కార్ పై లైంగిక వేధింపుల కేసు!

పీసీ సర్కార్ పై లైంగిక వేధింపుల కేసు! - Sakshi


పశ్చిమ బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలో ఇంద్రజాల మాంత్రికుడు పీసీ సర్కార్ లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్నారు.


పశ్చిమ బెంగాల్ లోని బర్సాత్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న పీసీ సర్కార్ లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన, ఇతర ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. పీసీ సర్కార్ పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354 కింద కేసు  నమోదైంది.


ఒకవేళ ఈ కేసులో శిక్ష ఖారారైతే మూడు సంవత్సరాల పాటు శిక్షపడే అవకాశం ఉంది. తన పేరిట 3.4 కోట్ల రూపాయల అస్తులన్నాయని తాజాగా ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన అఫిడవిట్ కూడా కొంత వివాదస్పదమైంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top