బీజేపీ నకిలీ ఓట్ల నాటకం


 సాక్షి, న్యూఢిల్లీ: నకిలీ ఓటర్లను జాబితాలోకి చేర్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్  అర వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నకిలీ ఓటర్ల నాటకానికి ఆ పార్టీ తెర తీసిందన్నారు. నకిలీ ఓటర్లను చేర్చి ఆప్ ఓటర్లను  తొలగించేలా చూడాలంటూ ఆ పార్టీ అగ్ర నేత ఒకరు అదే పార్టీకి చెందిన శాసనభ్యులను ఆదేశించారని ఆరోపించారు. ఓటర్ల పేర్ల తొలగింపు బీజేపీ డబ్బులు ఎరచూపుతోందన్నారు. ఈ విషయమై సోమవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన శనివారం ఉదయం ట్వీట్ చేశారు. ‘ప్రతి నియోజకవర్గంలో  కనీసం 5,000 మంది నకిలీ ఓటర్లను సృష్టించి , ఆప్ ఓటర్లను తొలగించాలంటూ బీజేపీ అగ్ర నాయకుడొకరు నగరంలోని శాసన సభ్యులందరినీ ఆదేశించారు.

 

 ఓటరు జాబితాలో చేర్చే ప్రతి కొత్త నకిలీ ఓటుకు రూ.1,500, తొలగించే ఆప్ ఓటుకు రూ.200 లంచంగా ఇవ్వచూపుతున్నారు. బీజేపీకి చెందిన ఓ వ్యక్తి ఒకరు నాకు ఈ  విషయం చెప్పారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల కమిషన్‌ను అధికారులను కలసి లాంఛనంగా ఫిర్యాదు చేస్తాం’ అని కేజ్రీవాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. బీజేపీ నకిలీ ఓట్ల కార్యక్రమం దిగ్భ్రమ కలిగిస్తోందని, నకిలీ ఓట్లను సృష్టించడం, ఓట్ల తొలగింపునకు సంబంధించి సమాచారం ఏదైనా ఉంటే తమకు తెలియజేయాలని, తాము దానిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతామన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ  సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు.

 

 అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31ృనుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్‌జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు.  ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యవృుంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విది తమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top