బెంగళూరులో మరో అకృత్యం

బెంగళూరులో మరో అకృత్యం


బెంగళూరు: భారత సిలికాన్‌ వ్యాలీ బెంగళూరులో మహిళల భద్రతకు భద్రత కొరవడుతోంది. వారిపై ఆకృత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మొన్న న్యూఇయర్‌ వేడుకల రోజు పెద్ద మొత్తంలో జరిగిన లైంగిక వేధింపులు, కన్నడ భాష రాలేదని నిన్న ఇద్దరు మహిళలపై వేధింపులు చోటుచేసుకోగా తాజాగా రోడ్డు పక్కన నడుస్తూ వెళుతున్న యువతులపట్ల బైక్‌పై వెళుతున్న వ్యక్తులు అవమానకరంగా ప్రవర్తించారు. వారిని అభ్యంతరకరంగా తాకేందుకు ప్రయత్నించి వెళ్లిపోయారు. ఈ సంఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదుకాలేదు.



అయితే పోలీసులు మాత్రం ఈ పరిస్థితి చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడినవారి కోసం తీవ్రంగా గాలింపులు మొదలుపెట్టారు. పశ్చిమ బెంగళూరులోని విజయనగర్‌ కాలనీలో చోటుచేసుకుంది. అయితే, తొలుత యువతుల వెనుక నెమ్మదిగా వచ్చిన వాహనంపై వచ్చినవారు వారిని తాకే సమయంలో వేగంగా ముందుకు వెళ్లిపోయారు. దీని ప్రకారం లైంగిక వేధింపులకోసం ప్రయత్నించారా లేక చైన్‌ స్నాచింగ్‌లాంటి దొంగతనానికి ప్రయత్నించారా అనే విషయాన్ని పరిశోధిస్తున్నామని పోలీసులు చెప్పారు. వారికోసం లుకౌట్‌ నోటీసులు కూడా అంటించినట్లు తెలిపారు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఈ వీడియో హల్‌ చల్‌ చేస్తోంది.


సంబంధిత మరిన్ని కథనాలకోసం చదవండి



‘మొకాళ్లపై కూర్చొని వేడుకోండి.. లేదంటే రేప్‌!’


 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top