కాక్పిట్లో సొ(సె)ల్లు కబుర్లు.. కో-పైలట్ సస్పెన్షన్

కాక్పిట్లో సొ(సె)ల్లు కబుర్లు.. కో-పైలట్ సస్పెన్షన్


విమానం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కానీ, కాక్పిట్లో ఉండగానే సెల్ఫోన్ తీసి సొల్లు కబుర్లు చెప్పినందుకు ఎయిరిండియాకు చెందిన ఓ కో-పైలట్ సస్పెండయ్యింది. కొద్దిరోజుల ముందే ఆమె తన ప్రీ-ఫ్లైట్ మెడికల్ చెకప్ (పీఎఫ్ఎంసీ) చేయించుకపోవడం, ఇప్పుడిలా సొల్లు కబుర్లు చెబుతుండటంతో ఆమెను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. డీజీసీఏ కూడా ఆమె కేసును తీవ్రంగా పరిశీలిస్తోంది.



ప్రయాణంలో ఆమె సెల్ఫోన్ ఉపయోగిస్తున్నట్లు పైలట్ ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. సెల్ఫోన్లు స్విచాఫ్ చేయాల్సిందిగా కేబిన్ క్రూ చెప్పగానే ప్రయాణికులతో పాటు పైలట్, కో పైలట్ కూడా తప్పనిసరిగా ఫోన్లు ఆపేయాలి. ఈ ప్రకటన తర్వాత ఏ ఒక్కరూ కూడా సెల్ఫోన్లలో మాట్లాడకూడదు. పైపెచ్చు, విమానం నడిపే సమయంలో మాట్లాడటం మరింత దారుణమైన నేరమని, అందుకే ఆమెపై విచారణ సాగుతోందని అధికారులు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top