బాలికపై అత్యాచారం..ఎమ్మెల్యే అరెస్ట్

బాలికపై అత్యాచారం..ఎమ్మెల్యే అరెస్ట్ - Sakshi


గువాహటి: ఇంట్లో పనిచేసే బాలికపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో అసోం ప్రతిపక్ష ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఆ బాలిక అగస్టు 29న బోకో పోలీసు స్టేషన్ పరిధిలోని మందిరా ఔట్పోస్టులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గువాహటిలో ఆయన కారులోనే తనపై అత్యాచారం చేశాడన్నది ఆమె ఫిర్యాదు. దీంతో వివిధ సెక్షన్ల కింద గోపీనాథ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల నుంచి పరారీలో ఉన్న ఎమ్మెల్యేను అరెస్ట్ చేసినట్టు ఆదివారం పోలీసులు వెల్లడించారు.



అయితే, తన ఇంట్లో పనిమనిషి చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్ ఖండించారు. ఇదంతా తనపై చేసిన కుట్ర అని, ఇది నూరుశాతం తప్పుడు కేసని ఆయన అంటున్నారు. ఆరోపణలలో వాస్తవం ఎంతన్నది దర్యాప్తులోనే తేలుతుందని ధీమా వ్యక్తం చేశారు. కొన్నాళ్ల క్రితం ఆమె తన ఇంటి నుంచి కొన్ని వస్తువులు తీసుకుని పారిపోయిందని ఆరోపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top