గోంగూర పచ్చడి, నెయ్యి అంటే ప్రాణం

గోంగూర పచ్చడి, నెయ్యి అంటే ప్రాణం - Sakshi


న్యూఢిల్లీ

ఎప్పుడూ విద్యార్థులతో సందడి సందడిగా ఉండే భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నెయ్యి, గోంగూర పచ్చడి అంటే ప్రాణం.  దక్షిణ భారతదేశ వంటకాలనుఎక్కువగా ఇష్టపడే కలాం ఇడ్లీలు లను చాలా ఇష్టంగా తినేవారట. దేశానికి విశిష్ట సేవలందించి ప్రజల రాష్ట్రపతిగా పేరుగాంచిన ఆయన రాష్ట్రపతిగా ఆయన అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.  చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. గొప్పమానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. అన్నిసుగుణాలు ఉన్నపరిపూర్ణ వ్యక్తి కలాం. దేశ విశిష్ట పురస్కారం భారతరత్నను అందుకున్న మూడో రాష్ట్రపతి  కలాం.



ఆయనకు ప్రకృతి అంటే ప్రాణం. చెట్లు పెంచడం ద్వారా ప్రకృతి సమతుల్యతను కాపాడాలని ఆయన అనేక సందర్భాల్లో ప్రజలకు పిలుపునిచ్చేవారు. ప్రతి ఇల్లూ పచ్చగా కళకళలాడాలని ఆయన కోరుకునేవారు. ఇంటి చుట్టూ చెట్లు పెంచి ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించేవారు. పిల్లలంటే వల్లమాలిన అభిమానం. నిత్యం వారికోసం పరితపించేవారు. జీవితంలో ఎన్నడూ క్రమశిక్షణను ఉల్లఘించలేదు. నిత్యం వ్యాయాయం చేసేవారు.  చాలా క్రమబద్ధమైన, నియమబద్ధమైన జీవితాన్ని గడిపారు. తద్వారా  యువతకు  ఉన్నతమైన సందేశాన్నందించారు. ఆయనకు పుస్తకాలు, సంగీతం అన్నా మక్కువ ఎక్కువే. ఈ నేపథ్యంలోనే ఆయన వీణ కూడా నేర్చుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top