ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం - Sakshi


 వేలూరు: వేలూరు జిల్లా అనకట్టు సమీపంలోని వరదలాంబట్టు గ్రామానికి చెందిన మునస్వామి(60) గురువారం ఉదయం మృతి చెందా డు. ఈయన దహన క్రియలకు పేర్నంబట్టు సమీపంలోని పల్లాలకుప్పం గ్రామానికి చెందిన మునస్వామి బంధువులు సుమారు 45 మంది మినీ లారీలో గురువారం మధ్యాహ్నం బయ లు దేరారు. ఆ మినీ లారీలో అందరూ నిల్చొని ప్రయూణిస్తున్నారు. చిన్న ఒంగపాడి గ్రామం వద్ద  ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించే సమయంలో, లారీ అదుపు తప్పి రోడ్డుపక్కనున్న సుమారు 10 అడుగుల లోతు లో బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న వారందరూ లారీ కింద  ఇరుక్కు పోయారు.

 

 వీరిని గమనించిన స్థానికులు వేపకుప్పం పోలీసులకు, ఒడుగత్తూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రైవేటు జేసీబీ యజమానికి సమాచారం అందించారు. జేసీబీ ద్వారా మినీ లారీని ఆ ప్రాంతం నుంచి తొలగించారు. అప్పటికే లారీకింద  చక్రవర్తి(50) స్వామి కన్ను(56), కుప్పుస్వామి(60), రాజమ్మాల్(75),  సంపూర్ణం(45), రుక్మణి(45), ఆనుముత్తు(55) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో 23 మంది పురుషులు, 12 మంది మహిళలు మొత్తం 35 మందికి తీవ్ర గాయాలయ్యూయి రిని వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఏడు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. మృత దేహాలను వారి ఇళ్ల ముందు ఉంచి దహన క్రియలు నిర్వహించారు. దీంతో గ్రామమంతా శోక సముద్రంలో మునిగిపోయింది.

 

 కలెక్టర్, ఎమ్మెల్యేల పరామర్శ: మినీ లారీ బోల్తా పడిన విషయం తెలుసుకున్న కలెక్టర్ నందగోపాల్, ఎమ్మెల్యే కలైఅరసన్, పాల డైరీ చైర్మన్ వేలయగన్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థలిని పరిశీలించారు. అదే విధంగా వేలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షత గాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందజేయాలని ఆదేశించారు.  లారీ డ్రైవర్, యజమాని అరెస్ట్: గూడ్స్ తరలించే మినీ లారీలో ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లి, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వెంకటేశన్, యజమాని వెంకటేశన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. లారీ, మినీ లారీల్లో ప్రయాణికులను ఎక్కించుకొని వెళితే పర్మిట్‌ను రద్దు చేయనున్నట్లు కలెక్టర్ నందగోపాల్ తెలిపారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top