'కోటక్‌' బ్యాంక్‌ మేనేజర్ ఎన్నికోట్లు వెనకేశాడంటే..

'కోటక్‌' బ్యాంక్‌ మేనేజర్ ఎన్నికోట్లు వెనకేశాడంటే.. - Sakshi

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్‌కు పాల్పడిన కేసులో ఈడీ అధికారులు అరెస్టు చేసిన ఢిల్లీ కేజీ మార్గ్‌లోని కొటక్‌ మహింద్రా బ్యాంకు శాఖ మేనేజర్‌ ఆశిష్‌ కుమార్‌ గురించి అవాక్కయ్యే అంశం తెలిసింది. అతడికి ఇటీవల అరెస్టయిన రోహిత్‌ టాండన్‌ నుంచి ఏకంగా రూ.51 కోట్లు అందినట్లు తెలిసింది. ఈ విషయాన్ని రోహిత్‌ టాండన్‌ విచారణ సమయంలో ఈడీ అధికారులకు చెప్పినట్లు సమాచారం. దాదాపు రూ.38 కోట్లను నకిలీ ఖాతాల పేరుమీద మార్చినట్లు ఐటీ అధికారులు గుర్తించారు.



ఆ డబ్బు మొత్తానికి కూడా అతడే నకలీ ధ్రువపత్రాలను తయారు చేసినట్లు తెలుసుకున్నారు. పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.13 కోట్లు డబ్బు మార్పిడి ద్వారా ఆశిష్‌ పొందినట్లు ఈడీ అధికారులు తెలుసుకున్నట్లు సమాచారం. నోట్ల మార్పిడి ప్రారంభమైన దగ్గర నుంచి బ్యాంకు అధికారుల అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు సామాన్యులు ఒక్క నోటు కోసం గంటల కొద్ది బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తుంటే.. కొందరు బ్యాంకు అధికారులు మాత్రం కట్టల కొద్ది డబ్బును బడాబాబుల ఇళ్లకు చేర్చుతున్నారు.



ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు బ్యాంకుల పై దాడులు చేస్తున్న ఐటీ అధికారులు ఢిల్లీ కేజీ మార్గ్‌లోని కొటక్‌ మహింద్రా బ్యాంకు బ్రాంచిపై మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ బ్యాకు మేనేజర్‌గా పనిచేస్తున్న ఆశిష్‌ కుమార్‌ ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని ఐదు రోజులపాటు విచారించేందుకు ఈడీ అధికారులకు ఢిల్లీలోని సాకెత్‌ కోర్టు అనుమతిచ్చింది. దీంతో ఈడీ అధికారులు రిమాండ్‌ కు తీసుకున్నారు. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top